Neerabh Kumar Prasad Appointed As AP New CS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బుధవారం నాడు నీరభ్ కుమార్ ప్రసాద్ ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మరోవైపు ఇప్పటి వరకూ సీఎస్‌గా ఉన్న కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. జూన్ నెలాఖరున జవహర్‌రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు.
Andhra Pradesh New CS Neerabh Kumar Prasad : ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలు చూడనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రెండు రోజుల్లో మరో ఇద్దరు, ముగ్గురు అధికారులనూ నియమించే అవకాశం ఉంది.
మరోవైపు ప్రస్తుతం సెలవులపై వెళ్లిన జవహర్ రెడ్డిపై వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేశారని జనసేన నాయకులు ఆరోపణలు చేశారు. ఆయన రాజధాని పేరుతో విశాఖ, భోగాపురం సమీపంలోని రైతుల భూములను అక్రమంగా వైసీపీ నేతలకు కట్టబెట్టే పనికి పూనుకున్నారని ఆరోపించారు. రైతులను బెదిరించి, వారి భూములను రాయించుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ తెచ్చుకున్నారని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డిని సెలవులపై వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
కేంద్ర కేబినెట్లో టీడీపీకి 4 స్థానాలు - జనసేనకూ ఛాన్స్? - TDP MPS INTO UNION CABINET 2024