ETV Bharat / state

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించిన ఎన్​డీఎస్ఏ బృందం - సీపేజీ నాణ్యతా లోపాలపై ఆరా! - Annaram Barrage Damage Issue

NDSA Committee in Telangana Today Updates : కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలన చేపట్టిన నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ శుక్రవారం రోజున జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించింది. నిపుణుల కమిటీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఎన్​డీఎస్​ఏ సభ్యులు గురువారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి రాత్రి రామగుండంలో బస చేశారు.

NDSA Committee Visits Annaram Sundilla Barrages

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 1:21 PM IST

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించిన ఎన్​డీఎస్ఏ బృందం

NDSA Committee in Telangana Today Updates : జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో అన్నారం బ్యారేజీకి(Annaram Barrage) చేరుకున్న కమిటీ సభ్యులు దాదాపు 3 గంటల పాటు బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సుందిళ్ల బ్యారేజీకి చేరుకుని అక్కడ కూడా మూడు గంటలపాటు పరిశీలించి సమగ్ర వివరాలు సేకరించారు. ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు.

బుంగలుపై ఆరాతీసిన నిపుణుల కమిటీ
ఆపరేషన్‌ మాన్యువల్‌లో లోపాలు, ఏర్పడిన సమస్యలపై దృష్టి సారించారు. అన్నారంలో బుంగలు ఎప్పుడు గుర్తించారనే అంశంతోపాటు అన్నారం బ్యారేజీ వద్ద 28, 38, 35, 48 పియర్ల వద్ద ఏర్పడిన నాలుగు బుంగలపై నిపుణుల కమిటీ ఆరా తీసింది. 2020 నుంచి బుంగలు పడుతూ వచ్చాయని వారు బదులిచ్చారు. 35వ పియర్‌ వద్ద పడిన పెద్ద గుంతకు చేపట్టిన కెమికల్‌ గ్రౌటింగ్‌పై నిపుణులు ప్రశ్నించారు.

Annaram Barrage Damage Issue : ఇంజినీర్లు 13 టన్నుల రసాయనాలు వినియోగించినట్లు చెప్పగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు 7 టన్నులే వాడినట్లు చెప్పడంతో ఈ తేడా ఏమిటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరదలకు సీసీ బ్లాక్స్‌ కొట్టుకుపోవడంపై వివరాలు తెలుసుకున్నారు. ఆపరేషన్‌ షెడ్యూల్‌(operation Schedule) ఎవరిచ్చారని అడిగారు. పియర్స్‌ వద్ద వరద నీరు(flood water) దిగువకు దూకే విధానానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు. పియర్ల వద్ద వెంట్‌లు, గేట్లను పరిశీలించారు. పియర్లకు పగుళ్లు ఏమైనా ఏర్పడ్డాయా అనే వివరాలు సేకరించారు. బ్యారేజీకి సంబంధించిన డ్రాయింగ్స్‌, అండర్‌ కవర్‌ డ్రాయింగ్స్‌, డిజైన్లు తదితరమైనవాటిని ఇంజినీర్ల నుంచి తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణపైనా ఆరా తీశారు.

ఎన్డీఎస్ఏ కమిటీ పర్యటన - బ్యారేజీల కీలక వివరాలు సేకరించిన బృందం

NDSA Team Visits Sundilla Barrage : సుందిళ్ల బ్యారేజీ(sundilla Barrage) పునాదుల నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు వివిధ దశల్లో తీసిన ఫొటోలను ప్రాజెక్టు అధికారులు అక్కడ ప్రదర్శించగా నిపుణులు తిలకించారు. బ్యారేజీకి సంబంధించిన విషయాలను నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు వారికి నివేదించారు. కమిటీ సభ్యులు 50వ పియర్‌ వద్ద కాసేపు సీసీ బ్లాక్‌లతోపాటు ఆప్రాన్‌ల నాణ్యతను పరిశీలించారు. అప్​ అండ్ డౌన్​ స్ట్రీమ్​లను పరిశీలించి గతంలో వరదనీటి ఉద్ధృతి వల్ల అక్కడక్కడా దెబ్బతిన్న ఆప్రాన్​ల వివరాలపై ఆరాతీశారు.

గైడ్​వాల్స్​ విషయాన్ని ఆరాతీసిన ఎన్​డీఎస్​ఎ అధికారులు
45, 46 పిల్లర్ల వద్ద గడ్డపార సాయంతో కొంతభాగం తవ్వి నమూనాలు సేకరించారు. ఇదే పిల్లర్ల(pillor) మధ్య సుమారు 20 నిమిషాల పాటు ఉండి చిత్రపటం సాయంతో సమగ్ర అధ్యయనం చేశారు. బ్యారేజీ గేట్ల(Barrage Gate) మధ్య ఉన్న గైడ్‌వాల్స్‌ పనితీరుపై ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పియర్ల నుంచి బ్యారేజీ గేట్ల వరకు అడుగు భాగాన నిర్మించిన సిమెంట్‌ రాఫ్ట్‌ డిజైన్లను పరిశీలించారు.

NDSA Team Members Observations : ఇక్కడ వరద పోటెత్తడం వల్ల ఆప్రాన్‌లు, వాటికి ఉన్న అడ్డుకట్టలు పూర్తిగా ఎందుకు దెబ్బతిన్నాయో నిపుణులు పరిశీలించారు. ఎగువ భాగంలో నీటి నిల్వ ఉండటంతో లోతుగా అధ్యయనం చేయలేకపోయారు. కేవలం ప్రాజెక్టు మ్యాప్‌(Project map) సహాయంతోనే నీటి నిల్వ సామర్థ్యం, భవిష్యత్తులో వరద నీటి ప్రవాహాన్ని(Water Flow) తట్టుకుంటుందా? లేదా? అనే విషయాలపై చర్చించారు. వరదల(Flood) మూలంగా బ్యారేజీకి కుడివైపు ఉన్న మట్టి కరకట్టలు దెబ్బతిన్న విషయంపై ఆరా తీశారు.

క్షుణ్నంగా పరిశీలిస్తూ, కొలతలు తీస్తూ, కారణాలు అన్వేషిస్తూ - మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్డీఎస్​ఏ నిపుణులు

ఎన్డీఎస్ఏ ప్రాథమిక నివేదిక ఆధారంగానే మరమ్మతులతో పాటు చర్యలు : ఉత్తమ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.