ETV Bharat / state

ఊరువాడా జోరుగా ఎన్డీఏ నేతల ఎన్నికల ప్రచారం - NDA LEADERS CAMPAIGN - NDA LEADERS CAMPAIGN

NDA Alliance Statewide Campaign : ఎన్నికల వేళ ఎన్డీఏ నేతల ప్రచారం ఊరువాడా జోరుగా కొనసాగుతుంది. ఇంటింటా తిరుగుతూ సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైఎస్సార్సీపీ అరాచక పాలనను ఎండగడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జగన్‌ను గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు.

nda_alliance_campaign_statewide
nda_alliance_campaign_statewide
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 2:00 PM IST

NDA Leaders Statewide Campaign : ఎన్నికల వేళ ఎన్డీఏ నేతల ప్రచారం ఊరువాడా జోరుగా కొనసాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైఎస్సార్సీపీ అరాచక పాలనను ఎండగడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే జగన్‌ను గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు.

కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్​ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. కృష్ణప్రసాద్‌ తనయుడు ధీమంత్ సాయి, తెలుగు యువత, టీఎన్​ఎస్​ఎఫ్​ (TNSF), ఐటీడీపీ (ITDP) సభ్యులతో కలిసి ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ రెండో వార్డులో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి సూపర్‌ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. తిరువూరు మేరీ మాత విగ్రహం వద్ద టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మధిర రోడ్డులోని ఎస్సీ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.

ప్రజాగళం సభ సూపర్​ హిట్​ - ప్రజలు, కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు - prajagalam Meeting success

అమలాపురంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలను కలిసి బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 40వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని కోరారు. జగన్ అరాచకాలకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి కడపలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా భూదాహానికి పేదలు అల్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. మైదుకూరులో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు కాలనీల్లో సూపర్‌ సిక్స్ పథకం కరపత్రాలను పంపిణీ చేశారు.

జోరు పెంచిన కూటమి అభ్యర్థులు - వైసీపీ అరాచకాలు ఎండగడుతూ ఎన్నికల ప్రచారం - nda Leaders election campaign in ap

అనంతపురంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ జోరుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు.

శ్రీకాకుళం జిల్లా సంచాంలో బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కొత్త చెరువు దగ్గర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతన దారులతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

నెల్లూరు జిల్లా రాజవోలు గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

ఊరూవాడా రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం- టీడీపీలోకి భారీగా చేరికలు - Election campaign in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.