ETV Bharat / state

జగన్ పాలనలో ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదు: ఎన్డీఏ నేతలు - NDA Leaders Fire On CM Jagan - NDA LEADERS FIRE ON CM JAGAN

NDA Leaders Fire On CM Jagan: రివర్స్ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టులను సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఎన్డీఏ కూటమి నేతలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పాలనలో 90 శాతం పూర్తైనా సాగునీటి ప్రాజెక్టులును కూడా పూర్తి చేయడం జగన్​కు చేతకాలేదని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తామని నేతలు స్పష్టం చేశారు.

NDA Leaders Fire On CM Jagan
NDA Leaders Fire On CM Jagan (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 1:30 PM IST

NDA Leaders Fire On CM Jagan : రాష్ట్రానికి మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని, రివర్స్ టెండర్లలతో సాగునీటి ప్రాజెక్టులను సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఎన్డీఏ కూటమి నేతలు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎడారిగా మారిందని దుయ్యబట్టారు. ఎన్నికల జిమ్మిక్కుల కోసం ఉత్తుత్తి ప్రారంభాలు చేస్తున్నాడని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ముంచాడని, సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టాడని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ, జనసేన నాయకులు గౌతమ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

జగన్‌ ఏలుబడిలో అటకెక్కిన జలయజ్ఞం - సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం - NEGLIGENCE ON JALAYAGNAM

Irrigation Projects Situation in Andhra Pradesh : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైందని ఎన్డీఏ కూటమి నేతలు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో 90 శాతం పూర్తైనా సాగునీటి ప్రాజెక్టులును కూడా పూర్తి చేయడం జగన్​కు చేతకాలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలల్లో 68,293 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు కేవలం 39,052 కోట్ల రూపాయాలు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలల్లో ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇవ్వలేదని ఆగ్రహం ఎన్డీఏ నేతలు వ్యక్తం చేశారు. జలయజ్ఞం పేరుతో 20 వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. గాలేరు, ఉత్తరాంద్ర సుజల శ్రవంతి, హంద్రినివా, మచ్చుమర్రి, తెలుగు గంగ ప్రాజెక్టులను గాలికి వదిలేశారని నిప్పులు చెరిగారు. నదులు అనుసంధానం చేసి రైతులకు సాగునీరు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే నాలుగేళ్లలో ఒక్క గేటు పెట్టని ఘనత అధికార పార్టీదని విమర్శించారు.

సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వని వైసీపీ సర్కారు- నాలుగున్నరేళ్లలో రెండే ప్రాజెక్టులు

జగన్ రెడ్డి ఇసుక దోపిడీకి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 39 మంది చనిపోయారని ఎన్డీఏ నేతలు ఆరోపించారు. జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు రక్షణ లేదని, సాగునీటి ప్రాజెక్టులు ముందుకు వెళ్లవని తెల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ చేశారు. రైతులను ఆదుకుని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తామని నేతలు స్పష్టం చేశారు.

చెరువుల అభివృద్ధికి గండి కొట్టిన జగన్​ సర్కారు - నిధులున్నా 'నీటిపారుదల' అస్తవ్యస్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.