ETV Bharat / state

కూటమి అధికారంలోకి రాగానే ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ - తప్పనున్న జగన్‌ ఛార్జీల బాదుడు - FREE BUS SCHEME TO WOMEN - FREE BUS SCHEME TO WOMEN

NDA Announce Free Bus to Women in Andhra Pradesh: తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుంది. కళాశాల, కోచింగ్​ సెంటర్​కు వెళ్లడానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, దిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఫ్రీబస్సు అమల్లో ఉంది. ఏపీలో మాత్రమే జగన్​ ప్రభుత్వం అమలుకు ఆమడ దూరంలో ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది.

Free Bus to Women in Andhra Pradesh
Free Bus to Women in Andhra Pradesh (ETV BHARAT)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 5, 2024, 2:05 PM IST

కూటమి అధికారంలోకి రాగానే ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ - తప్పనున్న జగన్‌ ఛార్జీల బాదుడు (Etv Bharat)

NDA Announce Free Bus to Women in Andhra Pradesh : విద్యార్థినిలు కాలేజ్‌కు వెళ్లేందుకు నెలవారీ బస్‌పాస్‌ కోసం డబ్బులు వెతుక్కోవాలి. చిరుద్యోగులు పని ప్రదేశాలకు వెళ్లాలంటే ఛార్జీలకు చిల్లర ఉందో లేదో సరిచూసుకోవాలి. పిల్లాపాపలతో పుట్టినింటికో, మెట్టినింటికో వెళ్లాలంటే ప్రయాణానికే కనీసం వెయ్యి రూపాయలు కావాలి. ప్రయాణమంటే ఎక్కడైనా ఇలా లెక్కలు వేసుకోవాల్సిందే. కానీ తెలంగాణలో మహిళలకు ఆ బెంగే అక్కర్లేదు. పర్సులో పైసా లేకుండా ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా చుట్టివస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం కూటమి కూడా మహిళలకు ఉచిత ప్రయాణ హామీ ఇచ్చిన వేళ తెలంగాణ మహిళలు ఎంతమేర లబ్ధి పొందారో ఇప్పుడు చూద్దాం.

ఇందులో అన్ని వర్గాల మహిళలున్నారు. అందరూ వేర్వేరు అవసరాల రీత్యా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తొస్తున్నావారే ఉన్నారు. ఆర్టీసీ బస్సెక్కినవారే. కానీ ఒక్క రూపాయి కూడా టికెట్‌కు ఇవ్వలేదు. ఎందుకంటే రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. తెలంగాణలోని పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్‌లతోపాటు, గ్రేటర్ హైదరాబాద్‌లోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు వైఎస్సార్సీపీ ఆరాటం

టీఎస్​ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 45 లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో 29 లక్షల మంది మహిళలే ఉన్నారు. కళాశాలలు, కోచింగ్‌లకు వెళ్లే అమ్మాయిలు ఒకప్పుడు నెలవారీ పాస్‌తీసుకునే వారు కానీ ఇప్పుడు ఆధార్‌కార్డు చూపించి ఫ్రీగా వెళ్లొస్తున్నారు. ఒక్క విద్యార్థినికి తక్కువలో తక్కువ వెయ్యి రూపాయల వరకూ మిగులుతోంది. ఆ డబ్బుతో పుస్తకాలు, ఇతర స్టేషనరీ సామాగ్రి కొనుక్కుంటున్నారు. మహిళలు ఒకప్పుడు చిరుద్యోగం దొరికితే ఆ వచ్చే డబ్బు ఛార్జీలకే సరిపోవని తిరస్కరించేవారు. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీకావడంతో ఎంచక్కా వెళ్లి వస్తున్నారు. ఆదా అయిన డబ్బుతో నిత్యావసరాలు కొనుక్కుకుంటున్నారు.

ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం వెనకడుగు - అమలు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో జగన్

రోజువారీ కూలికెళ్లే వాళ్లకు పది రూపాయలు మిగిలినా పట్టరాని సంతోషమే. ఇప్పుడు ఆ సంతోషాన్ని తెలంగాణలో వేలమంది మహిళలు పొందుతున్నారు. నెలకు హీనపక్షంలో మూడు, నాలుగు వేల రూపాయలు ఆదా అవుతున్నాయని సంబరపడుతున్నారు. తెలంగాణలో ఉచిత ఆర్టీసీ బస్సు పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. 2023 డిసెంబర్‌ 9న ఫ్రీ బస్సు అమల్లోకి రాగా ఇప్పటిదాకా 40కోట్ల జీరో టికెట్లు జారీ చేశారు. టీఎస్​ఆర్టీసీ లెక్కల ప్రకారం నాలుగు నెలల్లోనే మహిళలు 1,400ల కోట్ల మేర లబ్ధి పొందారు.

ప్రస్తుతానికి పొరుగునున్న తెలంగాణ, కర్ణాటకతోపాటు దిల్లీ, పంజాబ్‌లో మహిళలకు ఫ్రీబస్సు అమల్లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ఏపీఎస్​ఆర్టీసీ ఛార్జీలు పలుసార్లు పెంచి ప్రయాణికుల నడ్డివిరిచారు. తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆ బాదుడు భారం తప్పనుంది. తెలంగాణ తరహాలోనే మన మహిళలు కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా చుట్టేసి రావొచ్చు.

టీడీపీ 'మహాశక్తి'- ఉచిత బస్సు ప్రయాణం హామీపై ఆడపడుచు ఆసక్తి - Free bus For Women

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.