ETV Bharat / state

జేఈఈ, నీట్‌ ప్రిపేరవుతున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్!​

జేఈఈ మెయిన్స్​, నీట్​ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సాథీతో విశేష సేవలు.

target_jee_main_2025
target_jee_main_2025 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Target JEE Main 2025 : జేఈఈ (JEE Main 2025), నీట్‌ (NEET) సహా పలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సువర్ణావకాశం. ఐఐటీ కాన్పూర్‌తో కలిసి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సాథీ (SATHEE - సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, టెస్ట్‌ అండ్‌ హెల్ప్‌ ఫర్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) అనే పోర్టల్‌ ద్వారా విశేష సేవలందిస్తోంది. దీని ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఐఐటీ ప్రొఫెసర్లు/ సబ్జెక్టుల్లో నిపుణులతో ఉచితంగానే నాణ్యమైన గైడెన్స్‌ ఇస్తోంది. జేఈఈ మెయిన్‌-2025కు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల కోసం నవంబర్‌ 6 నుంచి 40 రోజుల క్రాష్‌ కోర్సును ప్రారంభించనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి.

  • జేఈఈ మెయిన్‌(JEE Main)కు సంబంధించి రికార్డ్‌ చేసిన లెక్చర్స్‌ను వారం వారం ఈ పోర్టల్‌లో వీక్షించవచ్చు. క్విజ్‌లో పాల్గొని మీరు ఏ మేరకు నేర్చుకున్నారో పరీక్షించుకునే వీలుంటుంది.
  • ఏఐ ఆధారిత అసెస్‌మెంట్‌లో భాగంగా 60వేలకు పైగా ప్రశ్నలను దీని ద్వారా యాక్సిస్‌ చేసుకోవచ్చు.
  • 100కి పైగా ఆల్‌ ఇండియా మాక్‌ టెస్టులు, టాపిక్‌ల వారీగా టెస్టులు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఆన్‌లైన్‌ స్టడీ మెటీరియల్‌, నోట్సు అందుబాటులో ఉంటుంది.

NCERT Launched Sathee For Free Coaching for Jee and Neet Students : జేఈఈ, నీట్‌లకు క్రాష్‌ కోర్సులతో పాటు మాక్‌ టెస్ట్‌లు, ప్రాక్టీస్‌ ప్రశ్నలు, వీడియో లెక్చర్స్‌, వెబినార్‌లు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌, కోర్సులు, ఇతర వివరాల కోసం ఈ లింక్‌ https://sathee.prutor.ai/sathee-jee/పై క్లిక్‌ చేయండి. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో మినహా ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యార్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఐఐటీ టాపర్లు, విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులతో ఈ వేదిక ద్వారా పైసా ఖర్చులేకుండా కోచింగ్‌ ఇస్తోంది. తెలుగు, ఆంగ్లంతో పాటు పలు భాషల్లో ఈ కోర్సులను అందిస్తున్నారు. అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (AICTE) దీనికోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ఆధారిత ట్రాన్సిలేషన్‌ టూల్‌ను అభివృద్ధి చేయగా పలు భాషల్లో సేవలందిస్తోంది.

విద్యార్థుల అకడమిక్‌ పురోగతిని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసేలా 'అపార్​'

రిజిస్ట్రేషన్‌ ఇలా..

  • ముందుగా సాథీ పోర్టల్‌ను సందర్శించాలి.
  • ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సైన్‌ ఇన్‌లోకి వెళ్లి మీ వివరాలు ఎంటర్‌ చేయాలి. లేదంటే సైన్‌ అప్‌ అవ్వాల్సి ఉంటుంది.
  • మీ పేరు, ఈ- మెయిల్‌ ఐడీ, ఫోన్ నంబర్‌తో పాటు మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి.
  • జేఈఈ/నీట్‌/ఎస్‌ఎస్‌సీ/బ్యాంకింగ్‌/ఐసీఏఆర్‌/సీయూఈటీ ఇలా మీరు దేనికి ప్రిపేర్‌ కావాలనుకొంటున్నారో ఆ వివరాలను ఎంచుకోవాలి.
  • రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక లాగిన్‌ అయ్యి లైవ్‌ సెషన్లు, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టూల్స్‌, వీడియో లెక్చర్లు వినొచ్చు.

'సార్ కాస్తా మా బాధను అర్ధం చేసుకోండి' - ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జాప్యంతో విద్యార్థుల ఆందోళన - Delay in MBBS Counseling AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.