ETV Bharat / state

మీ డైట్​లో ఈ పదార్థాలుంటే - ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం - MILLETS BEST DIET FOOD

కొవిడ్ రాకతో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ - చిరుధాన్యాలను తినేందుకే ప్రజలు ఆసక్తి - మిల్లెట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్న పోషకాహార నిపుణులు

millets_best_diet_food
millets_best_diet_food (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Millets Best Diet Food : మానసిక ఒత్తిళ్లు, పని వేళల్లో మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవనశైలి మారిపోయింది. పాశ్చాత్య నాగరికత, ఆహారం విషయంలో చోటు చేసుకుంటున్న విపరీత మార్పులు ఆరోగ్యాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆరోగ్యాన్నిచ్చే ఆహారమే శత్రువుగా మారితే ఇక చేసేదేముంది? జీవనశైలిలో మార్పు రెడీమేడ్ ఫుడ్​ కోరుతున్న తరుణంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

వాస్తవానికి కొవిడ్ రాకతో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఎంతో మంది పౌష్టికాహారానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే విషయాని, ఆ విలువను గుర్తెరిగి నడుచుకుంటున్నారు. ఈ క్రమంలో పాశ్చాత్య ఆహారానికి స్వస్తి పలుకుతూ ప్రకృతి అందించే చిరుధాన్యాలను తినేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో దాదాపు ప్రతి పట్టణంలోనూ మిల్లెట్​ ఫుడ్ వినియోగం పెరిగిపోయింది. వీధుల్లోనూ ఈ ఆహారాన్ని అందించే హోటళ్లు ఏర్పాటయ్యాయి.

"మిల్లెట్ సూపర్ ఫుడ్" - ప్రముఖ వైద్యులు ఏమంటున్నారంటే!

ఆహారంలో భాగం చేసుకుందాం..

చిరు ధాన్యాల్లో పోషకాలు అధికం. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరానికి ఎంతో మేలు చేసే కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, ఆరికెలు, సామలతో పాటు వరిగలతో చేసిన ఆహార పదార్థాలను డైట్​లో చేర్చుకుంటున్నారు. అవసరాన్ని బట్టి వారంలో మూడు రోజులు క్రమ తప్పకుండా తీసుకోవాలని ప్రకృతి వైద్యులు సూచిస్తున్నారు. మిల్లెట్ ఫుడ్​తో శరీరానికి విటమిన్స్, పోషకాల కొరత ఉండదని చెప్తున్నారు. జొన్నలు, రాగులు, సజ్జలను ఆహారంలో భాగం చేసుకుంటే రోగాలు దరి చేరవని వెల్లడిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటుతో పాటు గుండె, జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారు మిల్లెట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

సాగుబడితో రాబడి..

శ్రీకాకుళం జిల్లా రైతులు మిల్లెట్స్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పంటల పట్లపై ఆసక్తితో సాగు పద్ధతులపై అవగాహన పెంచుకుని ఉత్సాహంగా సాగు చేస్తున్నారు. మొత్తం 30 మండలాల పరిధిలో 5 గ్రామాల రైతులు చిరుధాన్యాలు, తృణధాన్యాలు పండిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. సుమారుగా 43 వేల మంది రైతులు 47 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం విధానంలో చిరుధాన్యాలు పండిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పాటు మిల్లెట్స్ సాగు కొనసాగిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో చిరుధాన్యాల ఆహారం తీసుకుంటున్న వాకర్స్
శ్రీకాకుళం జిల్లాలో చిరుధాన్యాల ఆహారం తీసుకుంటున్న వాకర్స్ (ETV Bharat)

విరివిగా విక్రయాలు..

శ్రీకాకుళం జిల్లాలో గతంతో పోలిస్తే చిరుధాన్యాల విక్రయం గణనీయంగా పెరిగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సుమారు 10 దుకాణాల్లో ప్రత్యేకంగా మిల్లెట్ ఫుడ్ అమ్ముతున్నారు. కిరాణా దుకాణాల్లోనూ వీటి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారంటే పెరుగుతున్న వాడకం ఏస్థాయిలో ఉందో తెలుస్తుంది. వినియోగదారులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తృణధాన్యాలతో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి మరీ అమ్ముతున్నారు. మార్నింగ్ వాకింగ్ వేళల్లో రోడ్డు పక్కనే కొందరు స్టాళ్లు నడుపుతూ రాగి జావ, ఇతర చిరుధాన్యాలతో చేసిన పదార్థాలను విక్రయిస్తున్నారు.

నిపుణుల సలహా తీసుకోవాలి..

చిరుధాన్యాలు, తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని శ్రీకాకుళానికి చెందిన పోషకాహార నిపుణుడు దార్లపూడి రవి తెలిపారు. గతంతో పోలిస్తే వినియోగం గణనీయంగా పెరిగిందని చెప్తున్నారు. తాను ఆరేళ్లుగా చిరుధాన్యాలు, వాటితో తయారైన పదార్థాలను విక్రయిస్తున్నానని తెలిపారు.

తృణధాన్యం.. గెలుపు మార్గం.. మోదీ నోట ఏపీ రైతు విజయగాథ

ఆ కలవరపాటే.. నా కదలికకు మూలం : ఖాదర్ వలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.