Nara Lokesh Fires On YSRCP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న ప్రత్యేక చట్టంలాగే బీసీలకు సైతం తీసుకు వస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అలాగే ముస్లిం, మైనార్టీ సోదరుల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశమని లోకేశ్ స్పష్టం చేశారు. సీఏఏ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు పలికిన వైసీపీ ఇప్పుడు మాటమార్చి టీడీపీపై చేసే దుష్ప్రచారం చేస్తున్న ఎవ్వరూ నమ్మడం లేదన్నారు. వైఎస్సార్సీపీ ఏపీని ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి దగ్గర్లోనే ఉందని విమర్శించారు. రెడ్ బుక్ అనే పేరు వింటేనే వైసీపీ పార్టీలో ఉండే ప్రతీ ఒక్కరిలో గుండెల్లో వణుకు మొదలైందని తెలిపారు. కార్యకర్తలు వచ్చే 40 రోజులు అప్రమత్తంగా ఉండి ప్రతీ ఓటు కూటమికి పడేలా శ్రేణులు కృషి చేయాలని సూచించారు.
సిద్ధం అంటే 'ప్రశ్నించిన వారిని తన్నడానికి సిద్ధమా'- నారా లోకేష్
ఈరోజు ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద లోకేశ్ సమక్షంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీగా చేరికలు జరిగాయి. గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కీలక నేతలందరని లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన తాడిశెట్టి వెంకటరావు దంపతులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ముందు తాడిశెట్టి వెంకట్రావు వందలాది కార్లతో లోకేశ్ ఇంటికి చేరుకున్నారు. అలాగే అనంతపురానికి చెందిన వైసీపీ నేత జయరామ్ నాయుడు దంపతులతో పాటు మరో ఐదుగురు కార్పొరేటర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
Special Law for BC People : ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతుంది. ఎవరిపైన ఎక్కువ అక్రమ కేసులు పెట్టిందో ఆ బాధితులకు అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత నాది. నాపైన మెుత్తం 24 నాలుగు కేసులు ఉన్నాయి. ఎన్నికేసులు పెట్టినా భయపడే పరిస్థితే లేదు. అధికారంలోకి వచ్చాక వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. తెలుగుదేశం ప్రకటించిన ఆరు పథకాలన్నీ తప్పక అమలు చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం పింఛన్ మాత్రమేగాక ఇతర అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటి వద్దకే వస్తాయి. ప్రభుత్వం ఏర్పడిన ఐదు సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే ఉద్యోగాలు వచ్చేవరకు ప్రతి ఒక్కరికి రూ.3 వేలు నిరుద్యోగ భృతిని చెల్లిస్తాం. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ ప్రభుత్వానికి బీసీలంటే చిన్న చూపని విమర్శించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న ప్రత్యేక చట్టంలాగే బీసీలకు సైతం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇది తరతరాలుగా బీసీ సోదరులకు ఉన్న కోరిక అని తెలిపారు. బీసీలపై ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా, వారిపై దాడికి పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో జగన్ రెడ్డి ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటాడని లోకేశ్ నిలదీశారు. జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ముఠా బీసీ సామాజికవర్గానికి చెందిన శ్రీనివాసులు భూమిని కబ్జా చేసి, అత్యంత దారుణంగా హతమార్చారని ఆరోపించారు. బాధితులను కాపాడాల్సిన ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి హంతకులకు మద్దతుగా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల భూములు లాక్కొని, చంపేందుకేనా నా బీసీలు, నా బీసీలని జగన్ అంటున్నాడని లోకేశ్ ప్రశ్నించారు.
టీడీపీలో చేరిన టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్- ఆహ్వానించిన నారా లోకేశ్