Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in YSR Kadapa District : తెలుగుదేశం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే చంద్రబాబు అమలు చేస్తారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. 'నిజం గెలవాలి' నినాదంతో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న విషయం అందరికి తెలిసిందే. నిజం గెలవాలి యాత్రలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా బి.కొండూరు మండలం గుంతపల్లిలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన తెలుగుదేశం కార్యకర్త ఓబుల్‌రెడ్డి కుటుంబసభ్యుల్ని భువనేశ్వరి ఓదార్చారు. అనంతరం కలసపాడు, పోరుమామిళ్ల ప్రాంతాల్లో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో బాధితులకు చెక్కులు కాకుండా భరోసా పత్రాలను నారా భువనేశ్వరి అందజేశారు.
ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : నారా భువనేశ్వరి
Nijam Gelavali Yatra in Badwel : బద్వేల్ ఆర్కనెక్షన్ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని బద్వేలు ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు మహిళలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెతో మాట మంతి చేశారు. తొలిసారిగా ఆమె బద్వేల్కి రావడంతో స్థానిక ప్రజలు ఆమె బస చేసిన చెన్నంపల్లి వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెతో ఫొటో దిగి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభిమానంతో తనను కలిసేందుకు వచ్చిన వారందరినీ భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలన్నీ సమసిపోతాయని భరోసా ఇచ్చారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి : నారా భువనేశ్వరి
AP MLA Elections : ఎన్నికల వేళ ఇప్పటికే రాాజకీయ ప్రచారాలు ఊపందుకున్నాయి. అన్ని పార్టీల వారు ప్రజల మద్ధతు కూడగట్టుకోవడానికి ప్రయాత్నలు ముమ్మరం చేస్తున్నారు. టీడీపీ లోకేశ్ శంఖారావం విజవంతమవుతున్న ఉత్సాహంతో నిజం గెలవాలి పేరిట రాష్ట్రంలో పర్యటనలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు ఈ సభల్లో, పర్యటనల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేస్తామన్న ధీమా తెలుగుదేశం పార్టీ నేతల్లో కనిపిస్తుంది. పార్టీ శ్రేణులు సైతం గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
నేటి నుంచి 'నిజం గెలవాలి' యాత్ర - 4 రోజులపాటు కొనసాగనున్న తొమ్మిదో విడత