Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in Annamayya District : రాష్ట్రం అభివృద్ధి చెందలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ' నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండె పగిలి చనిపోయిన వారిని ' నిజం గెలవాలి' నినాదంతో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లాలో నారా భువనేశ్వరికి టీడీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికారు.
Annamayya District : జిల్లాకు చేరుకున్న తమ అభిమాన నాయుడు సతీమణి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. పర్యటన భాగంగా రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు పరామర్శించేందుకు అక్కడి నుంచి బయలుదేరారు.
ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari Comments : యువతకు ఉద్యోగం రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మహిళలకు భద్రత పెరగాలన్న రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అన్యాయాలు, దాడులు, అవినీతికి ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రయోగించాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
Rajampet : రాజంపేటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకున్న నారా భువనేశ్వరికి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేశారు. నారా భువనేశ్వరి కార్యకర్తలకు అభివాదం చేయగా కార్యకర్తలు పెద్ద ఎత్తున సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం బద్వేల్ నుంచి బయలుదేరి పోరుమామిళ్ల కొత్త వీధి బలిజ కోటకు నారా భువనేశ్వరి పర్యటించింది. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో అసువులు బాసిన బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం వారికి ఆర్థిక సాయంగా రూ.3 లక్షలను అందజేశారు.