ETV Bharat / state

మంత్రిగా లోకేశ్- బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని భువనేశ్వరి పోస్ట్ - Bhuvaneshwari Wishes to Lokesh - BHUVANESHWARI WISHES TO LOKESH

Nara Bhuvaneshwari Tweet on Lokesh : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్​కు ఎక్స్​ వేదికగా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషిచేయాలని చెప్పారు. అప్పగించిన బాధ్యతను లోకేష్‌ సమర్థంగా నిర్వహిస్తాడనే నమ్మకం తనకు ఉందని ఆమె పేర్కొన్నారు

Bhuvaneshwari Wishes to Lokesh
Bhuvaneshwari Wishes to Lokesh (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 5:56 PM IST

Nara Bhuvaneshwari Wishes to Lokesh : రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు మంత్రి నారా లోకేశ్‌ కృషి చేయాలని ఆయన తల్లి నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్​కు ఆమె అభినందనలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజా సేవ చేస్తూనే ఏపీని సుభిక్ష మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన​ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నట్లు నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

ఇదే నిబద్ధత భవిష్యత్​లోనూ కొనసాగాలి : గతంలో మహిళలు న్యాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని నారా భువనేశ్వరి అన్నారు. కానీ చంద్రబాబు నాయకత్వంలో ఆ పరిస్థితి మారిపోయిందని తెలిపారు. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోంమంత్రి అనితకు, పోలీస్ సిబ్బందికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. మహిళల భద్రతపై ఇదే నిబద్ధత భవిష్యత్​లోనూ కొనసాగాలని నారా భువనేశ్వరి కోరారు.

Lokesh Took Charge as Minister : అంతకుముందు సచివాలయం నాలుగు బ్లాక్​లోని తన ఛాంబర్​లో మంత్రిగా నారా లోకేశ్‌ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు స్వీకరించారు. తనకు కేటాయించిన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రంపైనే లోకేశ్‌ మొదటి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధివిధానాలను కేబినెట్ ముందు పెట్టే ఫైల్‌పై సంతకం పెట్టారు.

ఈ సందర్భంగా లోకేశ్‌కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, సవిత, గుమ్మిడి సంధ్యారాణి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.

మరోవైపు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సచివాలయం నిర్వహణపై మంత్రి లోకేశ్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఛాంబర్​తో పాటు సచివాలయంలో గదులు నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు సెక్రటేరియట్​కు వచ్చే వారా అంటూ అధికారులను ఆరా తీశారు. అమాత్యులు ఇక్కడ అందుబాటులో ఉండేవారు కాదని అధికారులు మంత్రికి చెప్పారు. జగనే సచివాలయానికి రానప్పుడు మంత్రులు ఎలా వస్తారులే అని లోకేశ్​ వ్యాఖ్యానించారు.

ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతల స్వీకరణ - తొలి సంతకం ఆ దస్త్రంపైనే! - Nara Lokesh take charge as Minister

మెగా డీఎస్సీకి కేబినెట్ ఆమోదం - మంత్రివర్గ సమావేశ కీలక నిర్ణయాలు ఇవే! - Andhra Pradesh Cabinet Meeting

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.