ETV Bharat / state

మిద్దె తోటలతో అదరగొడుతున్న ఆదర్శ దంపతులు - కాలనీ వాసులతో కమ్యూనిటీ గార్డెన్‌ సైతం నిర్వహణ - Organic Rooftop Terrace Gardening

Organic Rooftop Terrace Gardening : ప్రస్తుత రోజుల్లో తినే ఆహారం దగ్గర్నుంచి తాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతిదీ కలుషితం అవుతోంది. పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఆహారంను తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. రసాయనాలతో పండించిన పండ్లు, కూరగాయలతో తరచూ అనారోగ్య సమస్యలు తప్ప మరొకటి లేదు. వీటిని అధిగమించాడానికి ఆ మహిళ సొంతంగా సాగును ప్రారంభించింది. ఇంటి మేడపైనే ఒక వనాన్ని సృష్టించి, మిద్దె సాగుకు శ్రీకారం చుట్టింది. తనతో పాటు మిగిలిన వారికి కూడా సేంద్రీయ కాయగూరలు, ఆహార పదార్థాలను అందించాలని కమ్యూనిటీ గార్డెన్‌ని కూడా ప్రారంభించింది. పూర్తి సేంద్రీయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల పెంపకం చేస్తూ ఎంతో మంది గృహిణిలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మరి, ఆ మహిళ సృష్టించిన సేంద్రీయ వనం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 5:09 PM IST

Terrace Garden Harvest
Organic Terrace Gardening (ETV Bharat)
మిద్దె తోటలతో అదరగొడుతున్న ఆదర్శ దంపతులు - కాలనీ వాసులతో కమ్యూనిటీ గార్డెన్‌ సైతం నిర్వహణ (ETV Bharat)

Woman Cultivating Food Crops on Terrace : రంగురంగుల పూలమొక్కలు, ఆరోగ్యకరమైన ఆహారాన్నిచ్చే కూరగాయలు, ఆయుర్వేద మందులను అందించే ఔషధ మొక్కలు, స్వచ్ఛమైన గాలిని అందించే చెట్లు ఇలా చూడముచ్చటమైన ఈ మిద్దెతోటను చూశారా? నల్గొండకి చెందిన ప్రకృతి ప్రేమికురాలు కవిత సృష్టించిన వనం ఇది. సేంద్రీయ కూరగాయలు పండించడానికి, ఈ మిద్దెసాగును మెుదలుపెట్టారు.

కొంచెం అభిరుచి, ఇంకొంచెం ఆలోచన. మరికొంచెం ఓపిక ఉంటే చాలు ఇంటిని నందనవనంలా మార్చేయవచ్చని నిరూపించింది ఈ మహిళ. ఇంట్లోకి అవసరమైన పండ్లు, పూలు, కూరగాయలు ఈ మేడపైనే పండిస్తోంది. అక్కడితో ఆగకుండా కమ్యూనిటీ గార్డెన్‌ని ప్రారంభించి చుట్టు పక్కల వారితో పాటు అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అంగాన్ వాడీ కేంద్రాలకు ఉచితంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పంపిణీ చేస్తుంది కవిత.

3 ఏళ్ల క్రితం మిద్దెసాగును ప్రారంభించిన దంపతులు : కవితకు చిన్నప్పటి నుంచి మెుక్కలు, పర్యావరణ పరిరక్షణ అంటే ఇష్టం. అ ఆసక్తితోనే పిట్టగోడ మీద చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేసుకుని మొక్కలు పెంచేది. వివాహమైన తర్వాత భర్త శ్రీనివాస్‌కు కూడా పర్యావరణం, మెుక్కల పెంపకంపై ఆసక్తి ఉండటంతో, ఇద్దరు కలిసి 3 ఏళ్ల క్రితం మిద్దెసాగును ప్రారంభించారు. తాను చదువుకుంది బైపీసీ కావడంతో మెుక్కలపై మరింత మక్కువ, అభిరుచి ఏర్పడిందని అంటోంది.

ఇంటిపై కప్పునే సాగు ప్రయోగశాలగా మలచి : రంగు రంగుల పూల సోయగాలు, వివిధ రకాల కూరగాయలు, రుచికరమైన పండ్లు ఇలా ప్రకృతిమాత ఒడి నుంచి జాలువారిన మొక్కలతో తమ ఇళ్లను పొదరిల్లులా మార్చేశారు ఈ దంపతులు. సహజంగా నగరాల్లో మొక్కలు పెంచటానికి అవసరమైన స్థలం ఉండదు. అయితే మనసు పెడితే మార్గం ఉంటుంది. ఏకంగా తమ ఇంటిపై కప్పుని సాగు ప్రయోగశాలగా మార్చుకున్నారు. మిద్దెసాగు పేరిట ఇటీవలి కాలంలో వచ్చిన నూతన ఒరవడిని అందిపుచ్చుకుని ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేసుకున్నారు.

ఇంటి కింది భాగం నుంచి మెట్లు, స్లాబ్‌ వరకు కుండీల్లోనే విభిన్న రకాల పూలు, కూరగాయల మొక్కలు సాగు చేస్తున్నారు. వీరు టమాటా, వంకాయ, బెండ, దొండ, కాకర, బీర తదితర కూరగాయలతో పాటు జామ, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు, గులాబి, మందారం, నందివర్దనం, గరుడ వర్థనం, మందారం, మంకెన, బంతి, చామంతి వంటి పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. అంతేగాక నిమ్మగడ్డి, తులసి, అల్లోవేరా వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతున్నామని చెబుతున్నారు.

Free Distribution of Vegetables to Anganwadi Centers : మిద్దెతోట కోసం చిన్న చిన్న ప్లాస్టిక్ కుండీలతో పాటు నల్లటి సంచులు, డ్రమ్ములను కొనుగోలు చేశారు ఈ దంపతులు. మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎక్కువగా మట్టి ఉండాలి. అందుకే పెద్ద డ్రమ్ములను ఉపయోగించారు. మొక్కలకు పోసిన నీరు డ్రమ్ము కింది భాగంలోని రంధ్రాలతో కిందకు పోయినా, స్లాబ్‌ ఫ్లోరింగ్ పాడైపోకుండా తగిన చర్యలు చేపట్టారు.

మార్కెట్లో దొరికే కూరగాయలన్ని చాలా వరకు రసాయనాలు, ఎరువులు, పురుగుమందులు వినియోగించి పండిస్తుంటారు. అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే ఇంట్లోకి అవసరమైన కూరగాయల్ని సొంతంగా పండించుకుంటున్నామని, వాటిని వివిధ అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అంగాన్‌వాడీ కేంద్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెబుతోంది కవిత.

హ్యాపీ గార్డెన్స్ అనే వాట్సాప్‌ గ్రూప్‌తో గార్డెనింగ్‌ సలహాలు : తనతో పాటు కాలనీ వాళ్లకి కూడా సేంద్రీయ సాగును పరిచయం చేయాలని అనుకుంది. అందులో భాగంగా కాలనీ వాళ్లతో కలిసి కమ్యూనిటీ గార్డెన్‌ను ప్రారంభించింది. కాలనీలోని అందరూ కలసి ఇంటి పక్కన ఖాళీ స్థలంలో పూర్తి సేంద్రీయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేయడం ప్రారంభించారు. సాగు కోసమైనా రోజు కొద్దిసేపు కమ్యూనిటీ గార్డెన్‌ దగ్గర అంతా కలుసుకోవడం చాలా బాగుంటుందని నిర్వహకులు చెబుతున్నారు.

అలాగే కావాల్సిన కూరగాయలను ఇలా పండించుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. హ్యాపీ గార్డెన్స్ అనే వాట్సాప్‌ గ్రూప్‌ని ప్రారంభించి, అందులో కమ్యూనిటీ గార్డెన్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు పంచుకుంటున్నారు. దీంతో పాటు సీడ్ బ్యాంకు ఏర్పాటు చేసి కావాల్సిన వారికి మెుక్కలు, విత్తనాలను కూడా సరఫరా చేస్తున్నారు. అలా పర్యవరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోంది కవిత.

Terrace Gardening Harvest : చిన్నప్పటి నుంచి మెుక్కలు, పర్యావరణ పరిరక్షణ అంటే ఇష్టంతో మిద్దెతోట ప్రారంభించామని, దీంతో తాము హరితవనంలో నివసిస్తున్న అనుభూతి కలుగుతుందని అంటున్నారు కవిత భర్త శ్రీనివాస్‌. అటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరతున్నారు. ప్రస్తుత కాలంలో కాలుష్యంను తప్పించుకుని బతకడమే చాలా కష్టం.

వీటితో పాటు తీసుకునే ఆహారం కూడా పూర్తిగా రసాయనాలతో ఉండటంతో, ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వీటికి చెక్‌ పెడుతూ కవిత చేస్తున్న మిద్దెసాగు ఎంతో మంది గృహిణిలకు స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరూ ఇలానే మెుక్కలు పెంచుతూ, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవాలని మిద్దె సాగు చేస్తున్న కవిత చెబుతున్నారు. మరి, వీలైతే మీరు కూడా ట్రై చేయండి.

Training for Terrace Gardening : టెర్రస్‌ గార్డెనింగ్‌.. జనం మెచ్చిన సేద్యం..!

Agri Horticulture Society: మిద్దెసాగు చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడికి ఓసారి వెళ్లాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.