ETV Bharat / state

YUVA : విద్యార్థులు బడికి డుమ్మాకొట్టారంటే ఈ మాస్టర్ ఇంటికొచ్చేస్తారు ​- ఇక పిల్లలతో పాటు పెద్దలకూ పాఠాలు! - Teacher Teaching Innovative Way

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 5:39 PM IST

Special Story On Nalgonda Teacher : ఆచార్య దేవోభవ అంటూ గురువుకు అగ్రాసనం వేసిన సంస్కృతి మనది. విద్యార్థి భవిష్యత్తును అంచనా వేసి అభివృద్ధి పథంలో నడిపిస్తాడు ఉపాధ్యాయులు. విద్యార్థుల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా శ్రమించి, వాళ్లు వృద్ధిలోకి వస్తే మా శిష్యులు అంటూ గర్వపడతారు. అలాంటి ఓ గురువు నల్గొండ జిల్లా దామెర ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గురిజ మహేశ్. బడికి రాని విద్యార్థులను ఇంటికెళ్లి మరి తీసుకొస్తూ, ప్రయోజకులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదండోయ్ తల్లిదండ్రులకు సైతం చదువు వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో చూద్దామా!

Teacher Educated parents of school children
Special Story On Nalgonda Teacher (ETV Bharat)

Teacher Teaching Innovative Way in Nalgonda : ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే, పాఠశాలకి వచ్చి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటమే కాదు. పాఠశాలలను బలోపేతం చేయడం కూడా మన బాధ్యతని బలంగా నమ్మే ఉపాధ్యాయుడు ఈయన. విద్యార్థుల హాజరు పెంచితే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని భావించాడు. చదువు గొప్పతనాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాడు.

దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఈ ఉపాధ్యాయుడి పేరు గురిజ మహేశ్. స్వగ్రామం నల్గొండ జిల్లా చండూరు. సాధారణ కుటుంబంలో పుట్టి చదువు కోవడానకి చాలా కష్టాలు పడ్డాడు. పదో తరగతి వరకు సొంతూర్లోనే చదువుకున్నాడు. ఆ తర్వాత చదువుల్లో ప్రతిభ చూపి బీఈడీ పూర్తి చేశాడు. 2009 మే నెలలో డీఎస్సీ రాసి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.

బడికి రాని పిల్లలను ఇంటికెళ్లి తీసుకుని వస్తున్న టీచర్‌ : 2010లో కనగల్ మండలం రెగట్టే ప్రాథమిక పాఠశాలలో మహేశ్‌కు మొదటి పోస్టింగ్ వచ్చింది. తర్వాత చెరుకుపల్లి, చామలపల్లి, జాన్​ తండా, నెవిళ్లగూడెంలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేశారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. 13 ఏళ్లుగా ఎక్కడ పనిచేసినా అంకితభావంతో పనిచేయడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మహేశ్ పని చేస్తున్నాడు.

చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాలు, తన విద్యార్థులకు రావొద్దని లక్ష్యం పెట్టుకున్నారు మహేశ్‌. రోజు పాఠశాలకు 10 నిమిషాలు ముందే వస్తారు ఈ మాస్టర్‌. ఏయే తరగతుల విద్యార్థులు రాలేదో గుర్తించి, మొదట క్లాస్ లీడర్లను పిలిచి వివరాలు తీసుకుంటారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి చదువు ప్రాముఖ్యత వివరించి నచ్చజెప్పి, బైక్ మీద పాఠశాలకు తీసుకొస్తుంటారు.

"ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల్లో తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, వాళ్లు వ్యవసాయ పనుల మీద పొలాలకు వెళ్లటం, పిల్లలు చిన్న చిన్న కారణాలు చెప్తే వారిని ఇంటి దగ్గర ఉంచటం చేస్తుంటారు. ఇలాంటివి అవైడ్​ చేసేలా పెద్దలకు విద్య ప్రయోజనాలు వివరిస్తూ, పిల్లలను బడిబాట పట్టేలా నావంతు నేను ప్రయత్నం చేస్తున్నాను."-గురిజ మహేశ్, ఉపాధ్యాయుడు

విద్యార్థులు బడికి డుమ్మాకొట్టారంటే మాస్టర్ కమింగ్ : విద్యార్థులు కావాలని డుమ్మా కొడితే వారు ఎక్కడున్నా వెళ్లి తీసుకొస్తాడు ఈ మాస్టర్‌. ఇంటికి వెళ్లడమే కాదు అవసరమైతే వ్యవసాయ బావులు, పొలాల వద్దకైనా వెళ్లి తల్లిదండ్రులు, పిల్లలకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తారు. క్రమం తప్పకుండా చేస్తున్న ఈ ప్రయత్నాలతో అటూ విద్యార్థుల్లో, ఇటూ తల్లిదండ్రుల్లో మార్పు వచ్చిందని ఉపాధ్యాయుడు మహేశ్ చెబుతున్నారు.

ఉపాధ్యాయుడు మహేశ్ వల్ల తమ పిల్లల్లో చాలా మార్పులు వచ్చాయని, రోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 100% హాజరు నమోదు కావడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐల సహకారంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఫీజులు కట్టేందుకు, పాఠ్యపుస్తకాలు ఇప్పిస్తున్నారు టీచర్ మహేశ్​. విద్యార్థులు వివిధ రంగాల్లో నైపుణ్యాలు పెంచేలా కృషి చేస్తున్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, కళలు, పొదుపు తదితర భిన్న అంశాల్లో ప్రోత్సహిస్తూ, ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందంటున్నారు ఈ యువ టీచర్‌.

మేడం సార్ మేడం అంతే - ఈ లెక్కల టీచర్‌ పాఠాలు చెప్పే లెక్కే వేరు - HAPPY TEACHERS DAY 2024

ఈ మాస్టారు పాఠం చెబితే రాళ్లయైన కరగాల్సిందే - కలాం డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్‌తో పిల్లలకు చేయూత - physics Teacher Sridhar teaching

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.