Pardhi Gang Arrested in Hyderabad: హైదరాబాద్లో రెచ్చిపోతున్న పార్థీ గ్యాంగ్ ముఠా ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నగర శివారులోని పెద్ద అంబర్పేట రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: ఇటీవలే జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బాధితులు తిరిగబడితే హత్యలు చేసిన ఘటనలు కూడా జరిగాయి. అప్రమత్తమైన నల్గొండ పోలీసులు నిఘా పెట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వారిని వెంబడించారు. రాచకొండ పరిధిలోకి దొంగలు పారిపోగానే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారి దుండగులు కత్తులతో ఎదురుదాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కడంతో వారిని అరెస్టు చేసి నల్గొండ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ముగ్గు వేస్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ - సీసీటీవీలో దృశ్యాలు - Chain Snatching in Mangalagiri