ETV Bharat / state

ఒకే షెడ్డులో నాలుగు తరగతులకు పాఠాలు - ఇట్లయితే మేం చదుకునేదెలా? - NAKREKAL GOVT SCHOOL PROBLEMS - NAKREKAL GOVT SCHOOL PROBLEMS

Nakrekal Govt School Students Facing Problems : విద్యార్థులకు గురువులే దేవుళ్లుగా, విద్యాలయాలే దేవాలయాలుగా కొలుస్తారు. కానీ నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వర్షాల కారణంగా భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదంగా మారింది. వీటికి అదనంగా సరిపడా మూత్రశాలలు లేకపోవడంతో ఆ విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు.

Nakrekal Government School
Nakrekal Government School (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 8:02 AM IST

Nakrekal Govt School Students Facing Problems : నల్గొండ జిల్లాలోని నకిరేకల్ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 695 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యలో జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్కో తరగతికి మూడు సెక్షన్లు ఉన్నాయి. 15 తరగతి గదులు అవసరం కాగా, ప్రస్తుతం పది తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ఈ వర్షాలకు గోడలు కూలిపోయేలా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గోడ కూలిపోగా, త్రుటిలో ప్రమాదం తప్పింది.

శిథిలావస్థకు చేరిన గదులను కూల్చివేయడంతో పాఠశాల షెడ్డులో ఒకే చోట నాలుగు తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో పాటు విద్యార్ధులకు, విద్యార్థినులకు సరైన మూత్రశాలలు, మరుగు దొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థతో అదనపు గదుల నిర్మాణం పూనాది దశలోనే నిలిచిపోయాయి. విద్యార్థులు నిండుగా ఉన్న పాఠశాలలో గదుల సరిపోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. గదుల సౌకర్యంతో పారిశుద్ధ వసతి, కంప్యూటర్‌ ల్యాబ్‌, కూర్చోడానకి బెంచీలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కూల్ టైమింగ్స్​ మారాయ్

పాఠశాలలో తరగతి గదులతో పాటు, ఫర్నిచర్ సమస్య కూడా ఉందని, వీటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. దీంతో అధికారులు సానుకూలంగా స్పందించారని వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారని తెలిపారు.పాఠశాల అభ్యర్థనతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. 695 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో సరైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందించేందుకు సహకరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

'మా పాఠశాలలో తరగతి గదులు సరిపోవడం లేదు. చదువుకోవడానికి ఇబ్బందింగా ఉంది. ప్రతి రోజు తరగతి బయట చదువుకునే పరిస్థితి నెలకొంది. లైబ్రరీ లేదు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్​ ల్యాబ్ లేదు. మొత్తం ఆరు వందలకు పైగా విద్యార్థులం ఉన్నాం. అందుకు తగ్గట్లుగా మరుగుదొడ్లు లేవు. ఇబ్బందిగా ఉంది. ఒక్కో తరగతికి మూడు సెక్షన్లు ఉన్నాయి. ఫర్నిచర్ కూడా సరిగా లేదు.' - పాఠశాల విద్యార్థులు

క్లాస్​రూంలో వర్షపు నీరు - గొడుగులతో పాఠాలు వింటున్న విద్యార్థులు - Rain in Classroom in Govt School

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.