'షెల్ కంపెనీలను పరిచయం చేసిందే జగన్- చంద్రబాబు విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి అవసరం లేదు' - Nakka Anand Babu made key comments - NAKKA ANAND BABU MADE KEY COMMENTS
Nakka Anand Babu: చంద్రబాబు విదేశీ పర్యటనపై జగన్ సొంత మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. విదేశాలకు వెళ్లేందుకు జగన్ మాదిరిగా చంద్రబాబు కోర్టులో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆనందబాబు చెప్పారు. సొంత మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 5:30 PM IST
Nakka Anand Babu made key comments: తెలుగుదేశం అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనపై సాక్షిలో తప్పుడు రాతలు రాశారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎక్కడికి వెళితే వీళ్లకు అవసరమా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ రీజన్ కారణంగా అన్ని విషయాలు బటయకు చెప్పరని గుర్తుచేశారు. జగన్ లా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు ఉన్నాయా అని నిలదీశారు.
జగన్ రెడ్డిపై 13 సీబీఐ ఛార్జ్ షీట్: జగన్ రెడ్డి విదేశాలకు (Jagan foreign visit ) వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలన్న నక్కా, చంద్రబాబు బయటకు వెళ్లాలంటే ఎక్కడా పర్మిషన్ అవసరం లేదన్నారు. జగన్ రెడ్డి ఆస్తులను ఈడీ జప్తు చేసిందని, పాస్ పోర్టును సీజ్ చేసిందన్నారు. జగన్ రెడ్డిపై 13 సీబీఐ ఛార్జ్ షీట్ లు ఉన్నాయని, పత్రిక, ఛానల్ ఉంది కదా అని అడ్డగోలు రాతలు చంద్రబాబుపై రాయించి బురద చల్లేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సూట్కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు అనే పదాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసింది జగన్ రెడ్డి అని నక్కా ఆక్షేపించారు.
తప్పుడు రాతలు రాస్తే: జగన్ పెద్ద ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు అందుకే 16 నెలలు జైల్లో ఉన్నాడని ఆరోపించారు. జగన్ పిల్లలు ఇంటికి వచ్చారు అయినా వాళ్లను తీసుకుని లండన్ ఎందుకు పారిపోయాడో తానే చెప్పాలన్నారు. తప్పుడు రాతలు రాసిన వారందరూ ఊచలు లెక్కపెడతారని నక్కా హెచ్చరించారు. అబద్ధాలతో నమ్మించాలనుకుంటే పిచ్చి భ్రమ అవుతుందని, తెలుగుదేశం నూటికి 1000 శాతం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
విదేశీ పర్యటనకు సీఎం జగన్- వీడ్కోలు పలికిన పార్టీ నేతలు - Cm Jagan tour
జగన్ రెడ్డి అస్మదీయులకు 15వేల కోట్లు: ఆరోగ్యశ్రీలో కూడా జగన్ నాటకమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత జగన్ రెడ్డిదేనని ఆయన విమర్శించారు. ప్రభుత్వం బకాయిలు కట్టకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ సేవలను ( Arogya Shri Services ) నిలిపేశాయని అన్నారు. కేంద్రం నిధులను జగన్ రెడ్డి దారి మళ్లించాడని దుయ్యబట్టారు. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా, జగన్ రెడ్డి అస్మదీయులకు 15వేల కోట్ల వరకు కట్టబెట్టారని ఆరోపించారు. ఓట్లకోసం డాక్టర్లను వాడుకుని గ్రామాల్లో ప్రచారం చేశారని మండిపడ్డారు. ఓటమి భయంతో వైకాపా నేతలు రాష్ట్రంలో రక్తపాతం సృష్టించారన్నారు. అరాచకం సృష్టించి వైకాపా నేతలు జోగి, అంబటి బుద్ధి లేకుండా బయటకు వచ్చిన మాట్లాడుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు.
భువనేశ్వరితో చంద్రబాబు విదేశీ పర్యటన - వారం రోజుల పాటు అమెరికాలోనే - Chandrababu foreign Tour