Municipal Employees Agitation: మున్సిపల్ కార్మికుల సమ్మెకాలంలో చేసుకున్న ఒప్పంద జీఓలను తక్షణమే జారీ చేయాలని మున్సిపల్ కార్మికుల సంఘాలు ఆందోళన చేపట్టాయి. విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన ఈ ఆందోళనలో పాల్గొన్న కార్మికులు సమ్మెకాలంనాటి ఒప్పందాల మేరకు జీవోలను తక్షణమే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, స్కిల్ సెమిస్కెల్డ్ వేతనాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను వెల్లడించాలని అన్నారు.
క్లాప్ డ్రైవర్ల సమస్యలపై తక్షణమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం సంప్రదింపులు చేసిందని, ఇప్పుడు ఆ ఒప్పందలకు సంబంధించిన జీవోలను జారీచేయకుండా జాప్యం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న జీవోల కోసం మళ్లీ నిరసనకు దిగడం విచారకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను తిరిగి ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదు: పారిశుద్ధ్య కార్మికులు
తమ సమస్యలు పరిష్కారించాలని గతంలో సమ్మె చేసిన విషయాన్ని కార్మికులు గుర్తు చేశారు. సమ్మె చేసిన సమయంలో ప్రభుత్వం కొన్ని డిమాండ్లకు ఒప్పుకుని, వాటిని పలహారం పంచినట్లుగా, అప్పుడొక్కటి, అప్పుడొక్కటి అమలు చేస్తున్నారని కార్మికులు వాపోయారు. ఒకటో తేదీ దాటిపోయినా ప్రభుత్వ ఒప్పందం ప్రకారం వేతనాలు ఇంకా రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
జీవోలు జారీ చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టం చేసి అడుగుతున్నామని, ప్రభుత్వం ఉరికే ఇచ్చినట్లు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న డిమాండ్లను అమలు చేయకపోతే రానున్న ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాలేరని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామే అని సీఎం సవాల్ చేస్తున్నారని, ముందు ఒప్పందం చేసుకున్న జీవోలను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆగదు - స్పష్టం చేసిన మున్సిపల్ కార్మికులు
అక్క చెల్లెమ్మల్లారా మిమ్మల్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్కక్తం చేశారు. అప్కాబ్ తీసుకువచ్చి ఊబిలోకి దింపారని మండిపడ్డారు. ఒప్పందలు పూర్తై దాదాపు నెల రోజులు కావస్తోందని కార్మికులు అన్నారు.
"సమస్యలు పరిష్కారించాలని గతంలో సమ్మె చేశాము. అప్పుడు ప్రభుత్వం కొన్ని డిమాండ్లకు ఒప్పుకుంది. సమ్మె నిర్వర్తించిన సమయంలోని జీతాలు ఇవ్వాలని కోరాగా, ఒప్పందం ప్రకారం జీతాలు ఇంకా రాలేదు. " - కార్మికుడు
'పుస్తెలు తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజనాలు వండుతున్నాం - బిల్లులు ఇవ్వరా'