ETV Bharat / state

కిడ్నాప్‌ చేసి, కుక్కలతో బెదిరించి - ఎమ్మార్పీఎస్ నేత కిడ్నాప్​ కేసులో విస్మయకర విషయాలు వెలుగులోకి - MRPS Leader Kidnap Case Update

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 1:45 PM IST

MRPS Leader Kidnap Case Update : యజమానిని బెదిరించి భూ కబ్జా. అంతటితో ఆగకుండా అందులోనే అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మాణం. దాని చుట్టూ 20 అడుగుల ఎత్తులో గోడ, సీసీ కెమెరాలు ఏర్పాటు. లోపలికి వెళ్లగానే భీతి గొలిపేలా పదుల సంఖ్యలో శునకాలు. ఎవరైనా ఎదురు తిరిగితే కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడం. ఇదీ ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసిన దుండగుల దుశ్చర్య. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

MRPS Leader Kidnap Case Update
MRPS Leader Kidnap Case Update (ETV Bharat)

MRPS Leader Kidnap Case Update : రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన ఎమ్మార్పీఎస్​ నాయకుడు నరేందర్‌ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేందర్‌ను కిడ్నాప్‌ చేసి శంషాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌లో బంధించినట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. బాధితుడు నరేందర్‌ను కిడ్నాప్ చేశాక శునకాలతో బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకోవైపు ఫామ్‌హౌస్‌ అనుమతి లేని ప్రాంతంలో నిర్మించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కిడ్నాప్‌నకు సంబంధించి ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు, మరో ముగ్గురి పాత్రపై ఆరా తీస్తున్నారు.

కిడ్నాప్​ చేసి చిత్రహింసలు పెట్టి : నార్సింగిలోని బృందావన్ కాలనీలో హరికృష్ణ అనే వ్యక్తికి చెందిన 1000 గజాల భూమిని పాత నేరస్థులతో కూడిన ఓ మాఫియా ఆక్రమించింది. ఈ నెల 10న హరికృష్ణ ఆదేశాలతో ఎమ్మార్పీఎస్​​ నాయకుడు నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ ఆ స్థలం వద్దకు వెళ్లి మాఫియాను ప్రశ్నించారు. ఈ క్రమంలో మాఫియా దుండగులు వీరిద్దర్నీ కిడ్నాప్‌ చేశారు. రెండు రోజుల పాటు నగరంలో వివిధ ప్రాంతాలకు తిప్పుతూ శంషాబాద్‌లోని ఫామ్‌హౌజ్‌లో బంధించి, చిత్రహింసలు పెట్టారు. ఈలోపు పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం, మాఫియాలోని నలుగుర్ని అరెస్టు చేయడంతో మిగిలిన నిందితులు నరేందర్, ప్రవీణ్‌లను శుక్రవారం ఉదయం వదిలిపెట్టారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు : నార్సింగి పోలీసులు బాధితులను వెంటతీసుకుని శంషాబాద్‌ ఫామ్‌హౌస్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ దాదాపు 30 శునకాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్‌హౌస్‌ ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు కిడ్నాప్‌నకు ఉపయోగించిన కారు కూడా అపహరించినదేనని దర్యాప్తులో తేలింది. కిడ్నాప్‌లో పాల్గొన్న నలుగుర్ని ఇప్పటికే అరెస్ట్‌ చేశామని, మరికొందరి పాత్రపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు గతంలోనూ కొన్ని నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో పదుల సంఖ్యలో శునకాల్ని ఎందుకు పెంచుతున్నారో ఆరా తీస్తున్నారు.

"నిందితులు తిప్పిన వాహనం కూడా వారిది కాదు. ఫ్లాట్​ విషయంలో ఒక వర్గం తరఫు నుంచి రక్షించడానికి వెళ్లాడు. ఈ కేసులో నలుగురు జైళ్లో ఉన్నారు. మరో ముగ్గుర్ని ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాం. దర్యాప్తు పూర్తయ్యాక మిగిలిన వివరాలు తెలియవస్తాయి"- చింతమనేని శ్రీనివాస్​, డీసీపీ

హైదరాబాద్​ వ్యాపారవేత్త కిడ్నాప్ కేసు - చాకచక్యంగా ఛేదించిన పోలీసులు - HYDERABAD BUSINESSMAN KIDNAP CASE

వ్యక్తిని కిడ్నాప్‌ చేసి 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ - సైబర్‌క్రైమ్‌ ఏసీపీ, తలకొండపల్లి ఎమ్మార్వోపై కేసు నమోదు - Kidnapping case against ACP and Mro

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.