MP Vijayasai Reddy about LookOut Notice in SEZ Case On Him : కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా చేజిక్కించుకున్నారన్న అంశంపై నమోదైన కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. తనపై 21 కేసులు ఉన్నాయని, ఎక్కడికెళ్లాలన్నా హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇది తెలిసి కూడా లుక్‌అవుట్ నోటీసులు ఇవ్వడం వెనుక దురుద్దేశం ఉందని, ఇది కేవలం తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలా చేశారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు సహా తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన కేవీ రావుపై ఏపీ హైకోర్టులో పరువు నష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుత కేసులో తాము నిర్దోషులుగా విడుదలైన తర్వాత మాలిషియస్ ప్రాసిక్యూషన్ కింద చంద్రబాబుపై కేసు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై గురువారం విజయసాయిరెడ్డి తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. జగన్‌తో పాటు వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతి ఒక్కరినీ, వాళ్ల అనుచరులను జైలుకు పంపాలన్న ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సెజ్‌లో వాటాలు గుంజుకున్న కేసులో కొత్త కోణాలు
కాకినాడ పోర్టు కేసు - హైకోర్టులో విక్రాంత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్