ETV Bharat / state

ఫోన్‌ ట్యాపింగ్‌కు మూలకారకులు కేసీఆర్‌, కేటీఆర్‌ : ఎంపీ లక్ష్మణ్‌ - MP Laxman On Phone Tapping - MP LAXMAN ON PHONE TAPPING

MP Laxman On Phone Tapping : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కును హరించివేసిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. నియంతృత్వాన్ని నమ్ముకున్న వాడు నీడను కూడా నమ్మడన్న లక్ష్మణ్, కేసీఆర్‌ కూడా ఎవరినీ నమ్మలేదని వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్‌ రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులపై నిఘా ఉంచేందుకు వారి ఫోన్లు ట్యాపింగ్‌ చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

BJP MP Laxman Fires On KCR
MP Laxman On Phone Tapping
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 2:17 PM IST

ఫోన్‌ ట్యాపింగ్‌కు మూలకారకులు కేసీఆర్‌, కేటీఆర్‌ : ఎంపీ లక్ష్మణ్‌

BJP MP Laxman On Phone Tapping : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియంతృత్వాన్ని పాటించే వాళ్లు నీడను కూడా నమ్మరన్నారు. కేసీఆర్‌ కూడా ఎవరినీ నమ్మలేదని అందుకే రాజకీయ నాయకులను, మీడియా ప్రముఖులపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారని ఆరోపించారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు గత ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందని మండిపడ్డారు.

BJP MP Laxman Press Meet : ఫోన్ ట్యాపింగ్‌కు ప్రభుత్వం పాల్పడితే సందట్లో సడేమియా అన్నట్లుగా అధికారులు సర్దుకున్నారని వ్యాపారులను బ్లాక్‌ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నుంచి కదలలేదని సచివాలయానికి ఒక్కసారి కూడా వెళ్లలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రతి పథకంలో స్కామ్‌లు చేశారని తెలిపారు. కమీషన్లు తీసుకున్నారని ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేశారన్నారు. కక్ష సాధింపులో భాగంగా పలువురిపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని చెప్పారు. ఈ కుంభకోణంలో కొంత మంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు.

ట్యాపింగ్ ప్రకంపనలు - నేతల పరస్పర ఆరోపణలు - telangana phone tapping case

BJP MP Laxman Fires On KCR : ఫోన్ ట్యాపింగ్‌ మూలకారకులు కేసీఆర్‌, కేటీఆర్‌ అని విమర్శించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుడు కాదని నిరూపించుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి లీకు వీరుడు కాదు గ్రీక్‌ వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశాలివ్వాలన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుందని కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో రెండో, మూడో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చని కేటీఆర్ అంటున్నారని ఫోన్‌ట్యాపింగ్‌ చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలని తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను గమనించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో ఓడించారని తెలిపారు.

"ఫోన్‌ ట్యాపింగ్‌కు మూలకారకులు కేసీఆర్‌, కేటీఆర్‌. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. కేసీఆర్ ఫోన్‌ట్యాపింగ్‌తో ప్రాథమిక హక్కుకు భంగం కలిగించారు. రెండో, మూడో ఫోన్‌ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చని కేటీఆర్ అంటున్నారు. ఫోన్‌ట్యాపింగ్‌ చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి కావాలి.కేసీఆర్‌ రాజకీయ నాయకులపై, మీడియా ప్రముఖులపై ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలి. కేసీఆర్‌ నియంతృత్వ పోకడలను ప్రజలు గమనించి ఓడించారు." -లక్ష్మణ్‌, బీజేపీ ఎంపీ

కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు : రఘునందన్ రావు - raghunandan rao on phone tapping

ఫోన్ ట్యాపింగ్​ బాధితుల్లో నేనూ ఉన్నాను : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి - Yennam Srinivas on Phone Tapping

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.