Telangana Youngman ROHITH Climbing Mountains : శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఈ యువకుడి పేరు రోహిత్ రావు. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి స్వస్థలం. తల్లి రమాదేవి. తండ్రి శ్రీనివాసరావు పారా అథ్లెట్. రోహిత్ తండ్రి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూనే స్విమ్మింగ్, షూటింగ్ వంటి క్రీడల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటి అర్జున అవార్డు పొందాడు. అప్పటి నుంచి ఆటలపై ఆసక్తి పెంచుకున్నాడు రోహిత్.
తండ్రి నుంచి నేర్చుకున్న ప్రతిభ పాటవాలను పర్వతారోహణ(Mountaining) వైపు మళ్లించాడు రోహిత్. ఒకవైపు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే పర్వతాలు ఎక్కడంలో మెళకువలను నేర్చుకున్నాడు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఓ అడ్వెంచర్ టూర్ సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్నట్లు రోహిత్ చెబుతున్నాడు.
Rohith Climbs 9 Mountains
రోహిత్ పర్వతారోహణతో పాటు సైక్లింక్‌పై కూడా ఆసక్తి ఉంది. దాంతో తరచూ వ్యాయామం(Exercise) చేస్తూ శారీరక దారుడ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. 2018లో పర్వతారోహణకు శ్రీకారం చుట్టిన రోహిత్ ఈ 6 సంవత్సరాలలో 9 పర్వతాలను అధిరోహించాడు. తాజాగా కిలిమంజారో అధిరోహరణ తనలో ఆత్మస్థైర్యాన్ని నింపిందని చెబుతున్నాడు. పర్వతారోహణ చేసేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని రోహిత్ అంటున్నాడు. వాటన్నింటికీ అధిగమిస్తూ లక్ష్యం వైపు అడుగులేశానని వివరిస్తున్నాడు. ఎత్తైన శిఖరాలను ఎక్కాలనుకుంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచిస్తున్నాడు.
"నా తండ్రి దివ్యాంగ స్పోర్ట్స్ పర్సన్. ఆయన 19 దేశాలు సందర్శించి మన రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చారు. మా నాన్న నుంచి నేను స్పూర్తి పొందాను. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న నేను ఇప్పటివరకు 9 పర్వతాలను అధిరోహించాను. ఇందుకోసం కొంత ఆర్థిక సహాయం కూడా అవసరమవుతుంది. పర్వతారోహణ చేయాలనుకుంటున్నవారు శారీరకంగా దృఢంగా ఉండాలి"- మాదాసు రోహిత్, పర్వతారోహకుడు
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా
పర్వతారోహణ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ, రోహిత్ మాత్రం ఆర్థిక ఇబ్బందులకు ఏనాడు తలోగ్గలేదు. ఎత్తైన శిఖరాలను ఎక్కడమే అంతిమ లక్ష్యంగా మందుకు సాగాడు. ఎవరైనా కాస్త సహకారం అందిస్తే భవిష్యత్తులు మరిన్ని సత్ఫలితాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు రోహిత్. పర్వతారోహణ, సైక్లింగ్‌తో పాటు రక్తదానం కూడా చేస్తుంటాడు రోహిత్. ఏడాదికి కనీసం 4 సార్లైన రక్తదానం చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే తన అంతిమ లక్ష్యమని చెబుతున్నాడు రోహిత్.
మారుమూల గిరిజన గ్రామంలో పుట్టాడు.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు..
కిలిమంజారోను అధిరోహించిన నిజామాబాద్ యువకుడు.. నెక్ట్స్ టార్గెట్ అదే..!