ETV Bharat / state

ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో పోలీసుల నోటీసులు - హైకోర్టులో రాజ్‌ పాకాల పిటిషన్, 2 రోజుల సమయం ఇచ్చిన న్యాయస్థానం

రాజ్ పాకాలకు ఇచ్చిన మోకిలా పోలీసులు నోటీసులు - హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌ పాకాల - పోలీసుల ముందు హాజరుకావడానికి 2 రోజుల సమయం ఇచ్చిన హైకోర్టు

RAJ PAKALA PETITION IN HIGH COURT
Police Notice to Raj Pakala for Farmhouse Party Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 30 minutes ago

Police Notice to Raj Pakala for Farmhouse Party Case : జన్వాడ ఫామ్​హౌస్​లో పార్టీ వ్యవహారంలో మాజీమంత్రి కేటీఆర్​ బావమరిది రాజ్‌ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం రాజ్‌ పాకాలకు నోటీసులు జారీ చేసినట్లు మోకిల పోలీసులు వెల్లడించారు. జన్వాడలోని ఫామ్​హౌస్​లో జరిగిన పార్టీకి సంబంధించిన విషయాలపై విచారించాల్సి ఉందని, ఇవాళ విచారణకు రావాలంటూ అందులో పేర్కొన్నారు. అడ్రస్‌ ఫ్రూఫ్‌తో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలను సైతం సమర్పించాలని సూచించారు.

విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో రాయదుర్గంలోని ఓరియన్‌ విల్లాస్‌లో మోకిల ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ఉన్న నోటీసులను రాజ్‌ పాకాల నివాసానికి అతికించారు. ఈ నేపథ్యంలో రాజ్‌ పాకాల ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్‌ దాఖలు చేయగా పోలీసులు అక్రమంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. భోజన విరామం తర్వాత జస్టిస్ విజయ్‌సేన్‌ రెడ్డి దీనిపై విచారణ చేపట్టారు. పోలీసుల ముందు హాజరుకావడానికి 2 రోజుల సమయం ఇచ్చారు. ఈ సమయంలోగా పోలీసుల ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

కేటీఆర్ బావమరిది ఫామ్​హౌస్​లో అర్ధరాత్రి భారీ శబ్ధాలతో పార్టీ - రైడ్ చేసిన పోలీసులు - డ్రగ్స్ గుర్తింపు

Last Updated : 30 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.