MLA Komatireddy Rajgopal Reddy Meets Minister Ponnam : హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిశారు. ఆయన మునుగోడు నియోజకవర్గంలోని ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మునుగోడు నియోజకవర్గంలో 21 కొత్త రూట్లల్లో పలు గ్రామాలను కలుపుతూ బస్సులు నడిపించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి, నారాయణపూర్ మండలాలకు కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం చేయాలని పొన్నం ప్రభాకర్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు.
మినిస్టర్ క్వార్టర్స్ లో
— Ponnam Prabhakar (@Ponnam_INC) August 12, 2024
మర్యాద పూర్వకంగా కలిసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు లోని వివిధ మండల అధ్యక్షులు,ముఖ్య నేతల తో కలిసి ఆర్టీసి ,బీసీ సంక్షేమ శాఖ కు సంబంధించిన పలు సమస్యలపై
వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి… pic.twitter.com/LTJtv2JLAm
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన వినతులపై మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిలను పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, షాద్‌నగర్ ఎమ్మెల్యేలు సంజయ్, విజయరమణరావు, శంకర్, కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ ఛైర్మన్ వినోద్ కుమార్‌లు భేటీ అయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో గల్ఫ్ బాధితుల సమస్యలను సీఎంతో చర్చించినట్లు తెలిపిన వినోద్ కుమార్, విదేశాల నుంచి సీఎం రాగానే గల్ఫ్ కార్మిక సమస్యలపై కార్మికులు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామని వేం నరేందర్‌రెడ్డి తెలిపారు.
జీవో 46పై మంత్రి పొన్నంను కలిసిన బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి : మరోవైపు జీవో 46 బాధితులతో కలిసి బీఆర్ఎస్ నేత ఏనుగల రాకేశ్‌రెడ్డి సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. మాజీమంత్రి కేటీఆర్ చొరవతో చర్చకు వెళ్లిన రాకేశ్‌రెడ్డి, జీవో 46 వల్ల గ్రామీణ విద్యార్థులకు జరుగుతున్న నష్టం గురించి మంత్రికి వివరించారు. రాజకీయ భేషజాలకు వెళ్లకుండా జీవో రద్దుకు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.
బిఆర్ఎస్ @BRSparty రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి చొరవతో GO 46 బాధితులతో కలిసి రాష్ట్ర మంత్రివర్యులు, #GO46 రాష్ట్ర మంత్రివర్గ సబ్ కమిటీ సభ్యులు పొన్నం ప్రభాకర్ @Ponnam_INC గారిని రాష్ట్ర సచివాలయంలో కలిసి GO 46, దాని కారణంగా అభ్యర్థులు ఏ రకంగా నష్టపోతున్నారు,… pic.twitter.com/EeKfPJ6tMG
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) August 12, 2024
జీవో రద్దుతో పాటు న్యూమరికల్ పోస్టులతో న్యాయం చేయడంపై మంత్రితో సమాలోచనలు చేశారు. ఆగస్టు 19న జీవో 46పై హైకోర్టులో జరగనున్న విచారణకు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హాజరయ్యేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని రాకేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో జీవో 46 బాధితులు మంత్రికి తమ బాధను చెప్పుకున్నారు. జీవో 46 రద్దుపై శాసనసభలో సబ్ కమిటీ సభ్యుడిగా ఉన్న మంత్రి పొన్నం, సానుకూలంగా సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.