ETV Bharat / state

మియాపూర్​లో పదేళ్ల బాలిక కిడ్నాప్ - పెద్దాపురంలో అద్దె ఇంట్లో నిర్బంధం - MIYAPUR GIRL KIDNAP CASE

బాలికకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చిన యువకుడు

MIYAPUR_GIRL_KIDNAP_CASE
MIYAPUR_GIRL_KIDNAP_CASE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 12:16 PM IST

Miyapur Girl Kidnap in Peddapuram Kakinada Dist : హైదరాబాద్ మియాపూర్​లో పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి కాకినాడలోని ఓ ఇంట్లో నిర్బంధించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్డంగి గ్రామానికి చెందిన కొత్త ఆనంద్ మియాపూర్​లోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. సమీప ఇంట్లో నివాసం ఉంటున్న పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకొని వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిర్బంధించాడు.

కొడుకు అప్పు చెల్లించడం లేదని తల్లి కిడ్నాప్​ - భయంతో దాక్కున్న కోడలు

పెద్దాపురంలో బాలికతో కలిసి ఆనంద్ ఆటో ఎక్కగా ఇద్దరి మధ్య సంభాషణపై అనుమానించిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఎస్ఐ మౌనిక ఆనంద్ ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి బాలికను రక్షించారు. డీఎస్పీ శ్రీహరి రాజు బాలిక నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలికను యువకుడు ఇంట్లో నిర్బంధిస్తే చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆనంద్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలిక కిడ్నాప్​పై ఇప్పటికే మియాపూర్​లో మిస్సింగ్​ కేసు నమోదైయినట్లు సమాచారం.

"ఎంతపని చేశావు స్వరూపా" - ఇంటికి వెళ్లి చాక్లెట్ ఇచ్చి నమ్మించావుగా!

రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద చేపల వ్యాపారి కిడ్నాప్‌- కోట్ల బకాయిలే కారణం - Fishmonger Kidnap at Rajahmundry

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.