Minor Groom Major Bride Marriage in AP : వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని ఇప్పుడు వివాహం కూడా చేసుకున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముందిలే అనుకుంటున్నారా? ఈ ప్రేమ కహానీలో అమ్మాయి మేజర్, అబ్బాయి మైనర్ కావడమే ఇక్కడ స్పెషల్. ఆ ఏముందిలే ఇలాంటి వివాహాలు జరుగుతుంటాలే అనుకుంటారా? వారిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెెళ్లారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆ ఇద్దరి ప్రేమ పెళ్లిపై పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు? చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ఇదీ జరిగింది : కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామకు చెందిన ఇరువురు ప్రేమికులు వివాహం చేసుకుని గురువారం పెడన పోలీస్ ఠాణాకు వచ్చారు. వారిద్దరిలో వరుడు మైనర్ కాగా వధువు మేజర్ కావడం గమనార్హం. పెళ్లికుమార్తెకు 18 ఏళ్లు నిండగా వరుడికి 19 సంవత్సరాల వయస్సు. అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా, అబ్బాయి ఇంటర్ వరకు చదివి ఆపేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురి పెద్దల్ని పిలిపించి చర్చించారు. వివాహానికి సంబంధించి 21 సంవత్సరాలు దాటే వరకు యువకుల్ని మైనర్‌గా పరిగణించాలని చట్టం చెబుతోందని ఎస్సై జి.సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలా? లేదా, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాలా అన్న విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.
ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న యువకుడు : వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు. ఇందులో ఇది మాములు విషయమే కదా అనుకుంటున్నారా? ఈ ప్రేమ కహానీ ఓ ట్రాన్స్‌జెండర్, యువకుడిది కావడమే ఇక్కడ స్పెషల్ అండి. ఆఁ ఏముందిలే ఈ మధ్యకాలంలో ఇలాంటి పెళ్లిళ్లు సామాజిక మాధ్యమాల్లో చాలానే చూస్తున్నాం అని కొట్టిపడేయకండి! యువకుడు తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వారందరి సమక్షంలో ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్నాడు. సాధారణంగా ట్రాన్స్‌జెండర్‌తో వివాహం అనగానే ఏ కుటుంబ సభ్యులైనా ఒప్పుకోరు. కానీ ఈ అబ్బాయి కుటుంబసభ్యులు మాత్రం కుమారుడి ఇష్టాయిష్టాలను గౌరవించి, అతడి మనసుకు నచ్చిన వ్యక్తి(ట్రాన్స్‌జెండర్)ని ఇచ్చి ఘనంగా మ్యారేజ్ చేశారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా వేడుకైంది.
శుభ గడియలు వచ్చేశాయ్ - పెళ్లికి బాజా మోగింది - కుమారి శ్రీమతి కానుంది - Wedding Season Started
ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమాయణం - ఫ్యామిలీని ఒప్పించి వివాహం - పెళ్లి తంతు మామూలుగా లేదుగా!