ETV Bharat / state

చెరువు కట్టలు, కాల్వల మరమ్మతులకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలి : మంత్రి ఉత్తమ్​ - Minister Uttam Meeting on Floods

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 5:47 PM IST

Updated : Sep 5, 2024, 9:52 PM IST

Minister Uttam on Rescue Operations : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం పంప్ హౌస్​ను యుద్ధప్రాతిపదికన పూర్వ స్థితికి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీవర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కాల్వల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ఆయన, శుక్రవారం ఉదయానికే ఆన్​లైన్​లో టెండర్లు అప్​డేట్ చేయాలని స్పష్టం చేశారు.

Minister Uttam about Tenders for Floods
Minister Uttam on Rescue Operations (ETV Bharat)

Minister Uttam about Tenders for Rescue Operations : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం పంప్ హౌస్​ను యుద్ధప్రాతిపదికన పూర్వ స్థితికి తీసుకురావాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కాల్వల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవాలని చెప్పారు. వెంటనే పాలనా పరమైన అనుమతులు తీసుకొని శుక్రవారం ఉదయానికి ఆన్​లైన్​లో టెండర్లు అప్​డేట్ చేయాలని సూచించారు. వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్తలపై మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు సమీక్షలో హాజరయ్యారు.

ఎగువన ఉన్న గొలుసు కట్టు చెరువు తెగడంతో ఒక్కసారిగా ఆడిట్ ద్వారా వరదనీరు పంప్ హౌస్​లోకి చేరినట్లు ఇంజినీర్లు మంత్రికి వివరించారు. పంప్ హౌస్ నిర్మాణ సమయంలో ఆ తరహా జాగ్రత్తలు తీసుకోలేదా ముందస్తుగా అంచనా వేయలేదా అని మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి ఇంజినీర్లను అడిగారు. అకస్మాత్తుగా వచ్చిన వరద పంప్ హౌస్​ను ముంచెత్తిందని వివరించారు. పంప్ హౌస్​లోని నీటిని తోడే పని ప్రారంభమైందని, నెల రోజుల్లో మళ్లీ యథాతథ స్థితికి వస్తుందని తెలిపారు. ఈ మేరకు అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఇంజినీర్లను ఆదేశించారు.

శాశ్వత మరమ్మతులకు రూ.350 కోట్ల అంచనా : యుద్ధప్రాతిపదికన పూర్వ స్థితికి తీసుకురావాలన్న మంత్రి, పనులు వేగవంతం చేయాలని సంబంధిత ఏజెన్సీకి స్పష్టం చేయాలని తెలిపారు. భవిష్యత్​లో ఈ తరహా ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఆదేశించారు. ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదన్న ఆయన, సంబంధిత చీఫ్ ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడుతుందని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాద సంకేతాలు గుర్తిస్తే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని, ప్రాజెక్టులతో పాటు జలాశయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

అన్ని షట్టర్లు, రెగ్యులేటర్లను క్షుణ్నంగా పరిశీలించాలని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. వర్షాలకు చెరువులు, కాల్వలు అన్నీ కలిపి మొత్తం 559 నిర్మాణాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.60 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.350 కోట్ల వరకు అవసరమవుతాయని ఇంజినీర్లు పేర్కొన్నారు. తాత్కాలిక మరమ్మతుల కోసం వెంటనే షార్ట్ టెండర్లు పిలవాలన్న మంత్రి, నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. సామర్థ్యం మేరకు జలాశయాల్లో నీరు నింపాలని ఇంజినీర్లకు మంత్రి తెలిపారు.

'రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు, వరద వల్ల ఇప్పటి వరకు ఎక్కడ నష్టం జరిగిందో ప్రభుత్వానికి నివేదిక పంపాలి. రిజర్వాయర్​ మేనేజ్​మెంట్లు, సరిపోయే అంత స్టోరేజీ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలి. ఈ రెండు మూడు రోజులు వర్షాలు కాకుండా తుపాను ఉంటుంది. వాటర్​ స్టోరేజీ విషయంలో అన్నీ జలాశయాల్లో అనుమతించిన తగిన వరకు స్టోరేజీ ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. వర్షాలతో ఉత్పన్నమువుతున్న పరిస్థితులతో చేయాల్సిన పనలు చేయండి. దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు టెండర్ల ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలి'- ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి

'2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి - ఆర్థిక ఇబ్బందులున్నా ప్రాజెక్టులు పూర్తి' - uttam om Devadula irrigation Works

Last Updated : Sep 5, 2024, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.