ETV Bharat / state

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్​ - Uttam Kumar Speech at assembly

Minister Uttam Kumar Reddy on Krishna Projects and KRMB Issues : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించే విధంగా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసనసభలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్​ఎంబీ సంబంధిత అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి, ఈ మేరకు పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇస్తున్నారు.

Minister Uttam Kumar Reddy on Krishna Projects
Minister Uttam Kumar Reddy on Krishna Projects and KRMB Issues
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 11:46 AM IST

Updated : Feb 12, 2024, 12:27 PM IST

Minister Uttam Kumar Reddy on Krishna Projects and KRMB Issues : ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించేది లేదని తెలిపారు. కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్​ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టి, ఆ విషయాలను పవర్​ పాయింట్​ ద్వారా ఎమ్మెల్యేలకు వివరించారు. రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించేలా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శాసనసభలో ప్రాజెక్టులపై పవర్​ పాయింట్​ ద్వారా మంత్రి వివరిస్తున్నారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్​పై పోలీసులను పంపించిన విషయాన్ని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి గుర్తు చేశారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నదీ జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అందరం ఆశించామని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. రోజుకు 3 టీఎంసీలు ఏపీ అక్రమంగా తరలించుకు వెళుతుందని అన్నారు. పదేళ్ల పాటు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 219 టీఎంసీలకు బీఆర్​ఎస్​ సర్కారు ఒప్పుకుందన్నారు. ప్రతి ఏడాది దిల్లీకి వెళ్లి 512:219 టీఎంసీలకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కుల సాధనలో బీఆర్​ఎస్​ సర్కారు విఫలమైందని విమర్శించారు. బచావత్​ ట్రిబ్యునల్​(Bachawat Tribunal) ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని శాసనసభలో మంత్రి తెలిపారు.

నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రుల సమీక్ష - ప్రాజెక్టుల అంచనాలు పెంచి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆగ్రహం

Uttam Kumar Reddy speech on Irrigation Projects : బీఆర్ఎస్​ పాలకులది అసమర్థతనో, అవగాహన లోపమో అర్థం కావడం లేదని మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో(Krishna Projects) 70 శాతం హక్కు పొందేందుకు తెలంగాణకు పూర్తి అర్హత ఉందని చెప్పారు. కానీ 512:219 టీఎంసీల కేటాయింపును ఏపీ శాశ్వతం చేస్తోందన్నారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని విమర్శలు చేశారు. కేసీఆర్​ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్​ పొగిడారని, తెలంగాణ జలాలను సైతం ఏపీకి ఇస్తున్నారని జగన్​ చెప్పారని నీటిపారుదల శాఖ మంత్రి తెలిపారు.

"జగన్​, కేసీఆర్​ గంటల తరబడి మాట్లాడుకున్నారు. కేసీఆర్​, జగన్​ కలిసి బిర్యానీలు తిన్నారు. కేసీఆర్​ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం జగన్​ పొగిడారు. తెలంగాణ జలాలను సైతం ఏపీకి ఇస్తున్నారని జగన్​ చెప్పారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం జీవో 203 ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని నిర్ణయించింది. రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించాలని నిర్ణయించింది. 797 అడుగుల వద్ద నీటి తరలింపునకు జీవో ఇచ్చింది." - ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి

అసెంబ్లీ సమావేశాలు పొడిగించే అవకాశం - 16 వరకు ఉభయసభల భేటీ!

నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం సన్నద్ధం - ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

Last Updated : Feb 12, 2024, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.