Minister Ponnam Comments on Hanmakonda RDO : హన్మకొండ ఆర్డీవో తన ఫోన్ కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకి పంపించారని, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) ఆరోపించారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందని ప్రతిపక్షనేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అకాల వర్షాల వల్ల పంటనష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Ponnam Fires on Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) అవినీతి పరుడని, బీజేపీలో యాత్రల పేరిట కార్పొరేట్ ఆఫీసుల నుంచి డబ్బులు వసూలు చేశారని కోడై కూస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనపై వస్తున్న ఆరోపణలపై బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నుంచి మూడు సార్లు ఓడిపోయారని, ఎంపీగా ఉండి కూడా ఓడిపోయి మళ్లీ పోటీ చేసే అర్హత బండి సంజయ్‌కు లేదని పొన్నం ఎద్దేవా చేశారు. తన కన్నతల్లిని అవమానించిన దుర్మార్గుడు బండి సంజయ్ అని తీవ్రంగా విమర్శ చేసిన పొన్నం, కిషన్ రెడ్డిని కేసీఆర్ అపాయింట్ చేయించాడని ప్రచారం జరుగుతోందన్నారు. దీనికీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గంగుల కమలాకర్, బండి సంజయ్‌లు ఇద్దరూ లోపాయికారి మిత్రులని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
Clash Between Bandi and Ponnam : బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. అసలు వివాదం ఎలా వచ్చిందంటే, బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తున్న సమయంలో హుస్నాబాద్‌లో పర్యటించిన ఆయన, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 'అయోధ్యలో రామమందిరం కట్టారు, అక్షింతల పేరుతో రేషన్ బియ్యం పంచుతున్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని నమ్మకం ఏంటి అని పొన్నం అడుగుతున్నారు. అయితే నేనూ ఒకటి అడుగుతున్నానంటూ పొన్నంపై బండి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. వీటిపై మంత్రి పొన్నం ఘటుగా బదులిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశావని ప్రశ్నిస్తే నా తల్లి గురించి మాట్లాడతావా? మళ్లీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో ఆయురారోగ్యాలతో ఉన్న నా తల్లి ఆత్మ క్షోభిస్తుందని మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. కన్నతల్లిని అవమానించిన దుర్మార్గుడంటూ బండి సంజయ్‌ని పొన్నం విమర్శించారు.
కరువు అనేది ప్రకృతి రాజకీయ పార్టీలను అనడం సరికాదు : పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : పొన్నం