Nara Lokesh Tweet on Modi with Punganur Cattle : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో పుంగనూరు లేగ దూడను చూడటం ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మోదీ నామకరణం చేసిన దీపజ్యోతి లేగదూడ ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలం చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిందని ఆయన చెప్పారు. దీపజ్యోతిపై మోదీ పెట్టిన వీడియో సందేశం హృదయాన్ని హత్తుకునేలా ఉందన్నారు. ప్రధానమంత్రి అధికార నివాసంలో కొద్దిగా ఆంధ్రప్రదేశ్‌ని చూడటం తమకు ఎప్పుడూ ఆనందమేనని లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన కోడె దూడ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This is a heart touching video. I am even more happy because Deepjyoti belongs to the Punganur cattle family, which hails from my home district of Chittor in Andhra Pradesh.
— Lokesh Nara (@naralokesh) September 14, 2024
It is always a delight for us to see a little bit of Andhra Pradesh in PM's residence! https://t.co/Xf7ysWhjr6
దూడ నుదుటిపై దీపం ఆకారం : కాగా ప్రధాని మోదీ అధికారిక నివాసమైన 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఓ గోవు లేగ దూడకు జన్మినిచ్చింది. ఆ లేగ దూడకు దీపజ్యోతి (Deepjyoti) అని నామకరణం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ (PM Modi Deepjyoti Video) తెలిపారు. దీపజ్యోతితో కొంత సమయం గడిపానని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు. ఈ దూడ నుదుటిపై దీపం ఆకారం కనిపించిందని, అందుకే దీపజ్యోతి అనే పేరు పెట్టినట్లు మోదీ వివరించారు.
A new member at 7, Lok Kalyan Marg!
— Narendra Modi (@narendramodi) September 14, 2024
Deepjyoti is truly adorable. pic.twitter.com/vBqPYCbbw4
మోదీ రాక కోసమే వెయిటింగ్- భేటీకి నేను రెడీ: పుతిన్ - Putin On Modi