ETV Bharat / state

గుడ్‌ మార్నింగ్‌ అంటూ తెలుగువారిని మేల్కొలిపే ఈనాడు వెయ్యేళ్లు వర్థిల్లాలి: మంత్రి లోకేశ్​ - Lokesh Congratulate Eenadu 50 Years - LOKESH CONGRATULATE EENADU 50 YEARS

Nara Lokesh Congratulate on Eenadu Golden Jubilee: ఈనాడు పత్రిక స్థాపించి 50 వసంతాలు పూర్తైన సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తుందని కొనియాడుతున్నారు. ఈనాడు ప్రారంభించిన అక్షర ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్షర సైన్యానికి మంత్రి నారా లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి దైనందిన జీవితంలో ఈనాడు పాత్ర ఏనాడూ మర్చిపోలేనిదని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.

Nara Lokesh Congratulate on Eenadu Golden Jubilee
Nara Lokesh Congratulate on Eenadu Golden Jubilee (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 7:58 AM IST

Minister Nara Lokesh Congratulate on Eenadu Golden Jubilee: జనహితమే అభిమతంగా, సమాజ శ్రేయస్సు కోసం ఈనాడు ప్రారంభించిన అక్షర ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్షర సైన్యానికి విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​ శుభాకాంక్షలు తెలిపారు. నాడు, నేడు, ఏనాడు ఈనాడుది ప్రజామార్గమని కొనియడారు. ప్రజాపక్షమై ప్రభుత్వాలతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు నిత్యం అక్షర యుద్ధం చేస్తూనే ఉందని ప్రశంసించారు. పాలకులు కక్ష కట్టి ఆస్తులు ధ్వంసం చేసినా, తప్పుడు కేసులతో వేధించినా జనానికి రక్షగా నిలుస్తూనే ఉందని కొనియడారు. పత్రిక ద్వారా సమాజానికి దిక్సూచిగా నిలవడం ఈనాడుకే చెల్లిందన్నారు. విద్య, విజ్ఞానం, వినోదం, ఉద్యోగం, వ్యవసాయం, క్రీడలు, వ్యాపారం, టెక్నాలజీ, స్వయం ఉపాధి, స్ఫూర్తివంతమైన కథనాలు, సమస్త సమాచారం పాఠకులకు అందించి తెలుగు లోగిళ్లలో చైతన్య క్రాంతిగా ఈనాడు నిలిచిందన్నారు.

విద్యుత్‌ కాంతులతో వెలుగులు చిమ్ముతున్న ఈనాడు కార్యాలయాలు - Eenadu 50 Years Celebrations

గుడ్‌ మార్నింగ్‌ అంటూ తెలుగువారిని మేల్కొలిపే ఈనాడు వెయ్యేళ్లు వర్థిల్లాలని లోకేశ్​ ఆకాంక్షించారు. ఈనాడు 50 ఏళ్ల సంబరం సమయంలో వ్యవస్థాపక ఛైర్మన్‌ రామోజీరావు గారు లేకపోవడం బాధాకరమన్న లోకేశ్​, కానీ ఈనాడు రూపంలో ఆయన మన మధ్యే జీవించి ఉంటారని స్పష్టం చేశారు. అర్ధ శతాబ్దం పాటు విలువలు, నిబద్ధత, విశ్వసనీయతతో సమాజ హితం లక్ష్యంగా దిగ్విజయంగా ఈనాడుని నడిపిస్తున్న యాజమాన్యం, ఉద్యోగులు, జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. ఈనాడు ఎడిటర్‌ నుంచి ఇంటికి ఈనాడు పేపర్‌ వేసే బాయ్‌ వరకు దశాబ్దాలుగా చూపిస్తున్న అంకితభావం ప్రశంసనీయమని కొనియడారు..

Speaker Ayyanna Patrudu Congratulate on Eenadu 50 Years: తెలుగువారి దైనందిన జీవితంలో ఈనాడు పాత్ర ఏనాడూ మర్చిపోలేనిదని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. 1983 నుంచి ఈనాడుతో నాకు అనుబంధం ఉందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి దేశ రాజధానిలో భంగం కలిగినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ దుర్మార్గపు పాలన అంత మొందించడానికి ప్రజలను చైతన్య పరచడంలో ఈనాడు పాత్ర మర్చిపోలేమని అయ్యన్న కొనియాడారు.

ఎన్టీఆర్‌ అధికారంలోకి రావడానికి కథనాల ద్వారా తోడ్పాటు అందించడమే కాదు, అధికారం చేపట్టాక వైఫల్యాలను ఎత్తిచూపి బాధ్యతలూ గుర్తుచేసిందని ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా బాధితులను ఆదుకోవడంలో "ఈనాడు"కు సాటి ఇంకోటి లేదన్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించడం, పాఠశాలలు నిర్మించడం రామోజీరావుకే సాధ్యమైందని పేర్కొన్నారు. 50 వసంతాల ప్రస్థానమంటే మాటలు కాదని, భవిష్యత్తులోనూ ఈనాడు తెలుగు వారి కోసం తన కృషిని కొనసాగిస్తుందని ఆశిస్తున్నానని అయ్యన్నపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Eenadu@50 : అభాగ్యుల పెన్నిధి - దేశమంతటా మానవత్వ పరిమళాలు వెదజల్లిన 'ఈనాడు' - EENADU Golden Jubilee Celebrations

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.