Minister Nadendla Manohar Inspections in Gollapudi at NTR District: రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. పంపిణీ చేసే సరకుల తూకం పరిశీలించారు. ప్యాకింగ్‌లో లోపాలను, బరువు తక్కువగా ఉన్నట్లు నాదెండ్ల గుర్తించారు. సరకు తూకంపై అధికారులతో ఆరా తీశారు. రైస్ మిల్లులోనూ తనిఖీలు నిర్వహించారు.
విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు: విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (State Energy Minister Gottipati Ravikumar) ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు, ఈదురు గాలుల వల్ల వివిధ ప్రాంతాల్లో కూలిన కరెంటు స్తంభాలు, తెగిన వైర్లు, దెబ్బతిన్న ఫీడర్ల పునరుద్దరణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కూలిపోయిన విద్యుత్ స్తంభాలను, తెగిన వైర్లను, దెబ్బతిన్న ఫీడర్లను తక్షణమే పునరుద్ధరించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం, అసౌకర్యం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని మూడు డిస్కంల సీఎండీలు టెలీ కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు.
వాలంటీర్లు రివర్స్ - వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు - Volunteers Filed Police Case on YCP