Minister Lokesh About Sandhya Rani Son Birthday Video Issue : తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్దని, ఏడు కొండలపై విషరాజకీయాలు చేయవద్దని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు. విజయవాడలో మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమల పద్మావతీ అతిథి గృహంలో జరిగినట్లు నీలి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఫేక్ జగన్ నువ్వు మారవు..
— Lokesh Nara (@naralokesh) September 17, 2024
నీ ఫేక్ మూకలు అస్సలు మారరు..
ఫేక్ చేసి చేసీ 151 నుంచి
11కి వచ్చావు..
మంత్రి సంధ్యారాణి విజయవాడ ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిపినట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నావు..
శ్రీవారితో పెట్టుకోవద్దు..
ఏడుకొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు..
ఒక్క సీటు… pic.twitter.com/znkjnAq4ru
‘ఫేక్ జగన్, నువ్వు మారవు నీ ఫేక్ మూకలు అస్సలు మారరు. ఫేక్ చేసీచేసి 151 నుంచి 11 సీట్లకు వచ్చావు. మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన బర్త్‌డే వేడుకలు తిరుమలలో జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నావు. శ్రీవారితో పెట్టుకోవద్దు. ఏడు కొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు. ఇదే తీరు కొనసాగిస్తే ఒక్క సీటూ లేకుండా పోతావ్’ - మంత్రి నారా లోకేశ్
Minister Sandhya rani Son Birthday Video Issue : విజయవాడ తన ఇంట్లో తన కొడుకు పుట్టినరోజుని జరుపుకుంటే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు. తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్‌లో జరుపుకున్నాం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. ఇటువంటి విష ప్రచారం చేసే వారిని ఆ దేవుడు క్షమించడని దుయ్యబట్టారు. ఆ ఏడుకొండల వాడిని పూజించే వ్యక్తిగా, ఒక భక్తురాలిగా ఇలాంటి పనులు తామెప్పుడూ చేయమని స్పష్టం చేశారు. జరుగుతోందంతా వైఎస్సార్సీపీ చేస్తున్న విష ప్రచారమని మంత్రి (Minister Gummadi Sandhya Rani) ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నా ఇంట్లో నా కొడుకు పుట్టిన రోజుని జరుపుకుంటే కొందరు తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్‌లో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి విష ప్రచారం చేసే వారిని ఆ దేవుడు క్షమించడు. ఆ ఏడుకొండల వాడిని పూజించే వ్యక్తిగా, ఒక భక్తురాలిగా ఇలాంటి పనులు మెమెప్పుడూ చేయ్యం.' - గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
జగన్ ఐదేళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు: కూటమి నేతలు - NDA Leaders Fire on Jagan