Minister Lokesh Fire on Jagan Tadepalli Palace Expenditure : గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి ప్యాలెస్‌కు ఇనుప కంచె రక్షణ కోసం రూ.12.85 కోట్లు ఖర్చు చేసిన ఉత్తర్వులను మంత్రి నారా లోకేశ్ బయటపెట్టారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం జగన్ 12.85 కోట్లు స్వాహా చేశారంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఇనుప కంచెను నిర్మించాడని ధ్వజమెత్తారు. నగదు కొరత ఉన్న రాష్ట్ర ఖజానా నుంచే ఇనుప కంచె నిర్మాణానికి ఖర్చు చేశారని ఆరోపించారు. పేదల ఇళ్ల కోసం ఖర్చు చేసే భారీ మొత్తాన్ని జగన్ అత్యవసర భద్రతా కారణాల సాకు చూపుతూ ఖర్చు చేశారని దుయ్యబట్టారు. జగన్ తన ఆనందం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన టన్నుల కొద్దీ ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని లోకేశ్ అన్నారు.
తాడేపల్లి ప్యాలెస్ కంచె ఖర్చు ఎంతో తెలుసా? - 30 అడుగులకు రూ.12.85కోట్లు - వివరాలు బయటపెట్టిన లోకేశ్ - MINISTER LOKESH FIRE ON JAGAN
జగన్ తన ఆనందం కోసం విచ్చలవిడిగా ఖర్చు - ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న లోకేశ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2024, 2:49 PM IST