Minister Kondapalli Srinivas Receiving Requests From People : తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌కు వివిధ జిల్లాల నుంచి వినతులతో బాధితులు వచ్చి ఇక్కట్లను ఏకరవు పెట్టుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై అధికంగా వినతులు వచ్చాయన్నారు. కొంతమందిని పింఛన్‌దారులను సైతం అనర్హులుగా చూపించి ఫించన్ రాకుండా నిలిపివేశారని బాధితులు వినతుల్లో పేర్కొన్నారు.
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు కూడా భూ సమస్యలపై తమ దగ్గరికి న్యాయం చేయాలని కోరారని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఎంఎస్ఎం ఇండస్ట్రీలో ఇన్సెంటివ్లో ఉన్న సమస్యలపై బాధితులు మంత్రికి వినతులు ఇచ్చారు. తక్షణమే అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. సంబంధిత అంశాలపై అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కడప జిల్లాలో పనికి రాలేదనే కోపంతో మరుగుతున్న నూనెను ఒక వ్యక్తిపై పోశారని, అక్కడి పోలీసులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాధితుడు మంత్రికి తన గోడును చెప్పుకున్నాడు. ఈ విషయంపై వెంటనే అక్కడి పోలీసులకు మంత్రి ఫోన్ చేసి సమస్యను తర్వితగతిలో పరిష్కరించాలని ఆదేశించారు. టీడీపీ కార్యాలయానికి వెళితే సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ప్రజలకు కలిగేలా తాము కృషి చేస్తామని మంత్రి అన్నారు. అదే విధంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి సమస్యలు ఏమున్నా పార్టీ కార్యాలయానికి వచ్చి వినతులు ఇవ్వొచ్చన్నారు.
జగన్ హయాంలో నష్టపోయాం ఆదుకోండి - సీఎం చంద్రబాబుకు వినతులు - CM Chandrababu Receiving Requests