Minister Kandula Durgesh Distributed Vidya kits in Nidadavolu Vidya kids Girls' High School : విద్యార్థులుగా ఉన్నప్పుడే మంచి అలవాట్లు పాటించి క్రమశిక్షణను నేర్చుకోవాలి. అదే మన జీవితంలో కూడా పాటించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు విద్యా కిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ క్రమశిక్షణ ఎదుగుదలకు సహకరిస్తుందని, పాఠశాలలో పుస్తక పాఠాలే కాకుండా జీవితం నేర్చుకోవాలని విద్యార్థులకు ఉపదేశించారు.
Vidya kits Distribution : విద్యార్థులు వేషధారణలో అలవాట్లలో పాటించే క్రమశిక్షణను జీవితంలో కూడా పాటించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జీవితంలో పాటించే క్రమశిక్షణ ఎదుగుదలకు సహకరిస్తుందని ఆయన వివరించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు విద్యా కిట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విద్య కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమం ప్రారంభంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆధునీకీకరించిన వేదికను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో మాట్లాడుతూ కేవలం చదువు మాత్రమే కాక జీవితంపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని సూచించారు.
మంచి మార్కులు సాధించడానికి బాగా చదువుకుని ప్రయత్నించాలని, తగిన స్థాయిలో మంచి మార్కులు రాకపోయినా బలహీన పడకూడదని, రాబోయే కాలంలో మంచి మార్కులు సాధిస్తామని ధీమాతో ముందుకు సాగాలని సూచించారు. చదువుతోపాటు దేహదారుఢ్యానికి క్రీడలు కూడా అవసరం అన్నారు. చాలామంది కేవలం చదువు దృష్టితో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుకు గదులతోపాటు కనీసం ఆటస్థలం కూడా ఉండదని తెలిపారు. విద్యార్థులు ఎవరికి వారే అవగాహన పెంచుకుంటూ మనోబలాన్ని పెంచుకునేలా ఆలోచిస్తూ ముందు సాగాలని మంత్రి దుర్గేష్ సూచించారు. పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపరచడానికి సహకరిస్తున్న పాలకవర్గాన్ని అభినందించారు.
పేరు మార్చి, జనాలను ఏమార్చి, బేబీ కిట్స్‌ను లేపేశారు? - CM Jagan Careless on YSR Aasara
'విద్యార్థి దశ చాలా కీలకమైంది. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే ఇప్పుడే సరిగ్గా చదవాలి. చదువుతో పాటు శారీరక శ్రమ అవసరం. పిల్లలు కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా ఆటస్థలానికీ వెళ్లాలి.' - కందుల దుర్గేష్, పర్యాటక మంత్రి
జగన్ బొమ్మలు కవర్ చేసేందుకు అవస్థలు- వైసీపీ ప్రచార పిచ్చితో ఉద్యోగుల పాట్లు