ETV Bharat / state

'అన్నిటికంటే భయంకరమైన వ్యాధి అదే - డ్రగ్స్‌తో భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దు' - Minister Jupally on Drug Addiction - MINISTER JUPALLY ON DRUG ADDICTION

Minister Jupally about Drugs Free State : డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయని, దానికి యువత బానిసలుగా మారవద్దని సూచించారు.

Minister Jupally on Drugs Consumption
Minister Jupally about Drugs Free State (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 6:43 PM IST

Minister Jupally on Drugs Consumption : డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ లక్ష్యమని, సమాజానికి హానికరమైన మాదక ద్రవ్యాల చలామణిని అడ్డుకుందామని రాష్ట్ర ఆబ్కారీ, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ర‌వీంద్ర‌భార‌తి ప్రాంగ‌ణంలో ప్ర‌జానాట్య మండ‌లి ఆధ్వర్యంలో 'డ్రగ్స్​ను నిర్మూలిద్దాం-స‌మాజాన్ని మేలుకొలుపుదాం' పేరిట చేప‌ట్టిన క‌ళాయాత్ర‌ను మంత్రి జూప‌ల్లి జెండా ఊపి ప్రారంభించారు.

ఆగ‌స్టు 21 నుంచి సెప్టెంబ‌ర్ 21 వ‌ర‌కు హైద‌రాబాద్​తో పాటు న‌గ‌ర శివారులోని హై స్కూల్స్, జూనియ‌ర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పీజీ కాలేజీల్లో క‌ళా ప్ర‌ద‌ర్శ‌న ద్వారా డ్ర‌గ్స్ గురించి, దాని వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల ప‌ట్ల అవగాహన కల్పించ‌నున్న‌ట్లు నిర్వ‌హ‌కులు మంత్రికి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ సమాజ మార్పులోనూ, నవ సమాజ నిర్మాణంలోనూ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

మత్తు అనే మహమ్మారికి యువత బానిసలుగా మారవద్దని, తాత్కాలిక ఉపశమనం కోసం భవిష్యత్తు అంధకారం చేసుకోకూడదని సూచించారు. మాదక ద్రవ్యాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు ఆకర్షితులు కావొద్దని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగమే సమాజంలో అన్నిటికంటే భయంకరమైన వ్యాధి అని అభివర్ణించారు.

యువత సైనికులు పనిచేయాలి : చాపకింద నీరులా అది వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అప్రమత్తం కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్‌ కమిటీల్లో చేరి సైనికులుగా పనిచేస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ప్ర‌జానాట్య మండ‌లి నిర్వ‌ాహ‌కుల‌ను, క‌ళాకారుల‌ను మంత్రి ఈ సంద‌ర్భంగా అభినందించారు.

'సమాజ మార్పులోనూ యువత భాగస్వామ్యం కావాలి. మత్తుకు యువత బానిసలుగా మారవద్దు. మాదక ద్రవ్యాలు మనుషుల జీవితాలను నాశనం చేస్తాయి. డ్రగ్స్​ను వినియోగిస్తున్న సరఫరా చేస్తున్న వారి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్న ప్ర‌జానాట్య మండ‌లి నిర్వ‌ాహ‌కులకు, క‌ళాకారుల‌కు నా అభినందనలు'-జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి

విద్యార్థులే డ్రగ్స్​కు బానిసైతే సమాజం ఏం కావాలి : సీఎం రేవంత్ - CM Revanth On NSS Volunteers

డ్రగ్స్ వాడొద్దని భారతీయుడు-2 టీమ్ స్పెషల్ వీడియో - అభినందించిన సీఎం రేవంత్​ - CM Revanth Reacts on Bharateeyudu 2

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.