Minister Anagani In Idi Manchi Prabhutvam Program in Bapatla : ప్రజల మనోభావాలతో ఆడుకున్న దుర్మార్గుడు జగన్ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. బాపట్ల జిల్లా రేపల్లెలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. జగన్ విధానాలతో రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ హామీలు అమలు చేస్తున్నామన్నారు. అవినీతి సొమ్ము కోసం తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన జగన్తో ఉండటం ఇష్టం లేకే చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు పార్టీ మారుతున్నారన్నారు.
Minister Anagani Fire on YSRCP : ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అహంకారానికి నిదర్శనం అయిన జగన్ను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారన్నారు. జగన్ లాంటి వ్యక్తితో ఉండటం ఇష్టం లేక చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు పార్టీ మారుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి ప్రజలను అంధకారంలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు.రాష్ట్రం అప్పుల్లో ఉన్నా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, అభివృద్ధి, సంక్షేమ రెండు కళ్లుగా భావిస్తూ పాలన సాగిస్తున్నారనీ కొనియాడారు. భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని, రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చేలా అన్న క్యాంటీన్లు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతు చేస్తామన్నారు.
'నోటు మీద ఉన్న గాంధీ బొమ్మమీద తప్ప జగన్కు ప్రజల మీద కనీస గౌరవం లేదు. ప్రజల విశ్వాసాలను లెక్కచెయ్యకుండా దేవుడి ప్రసాదాన్ని సైతం కల్తీ చెయ్యడానికి వెనకాడలేదు. అందుకే తన పార్టీ వాళ్లు కూడా నేడు జగన్మోహన్రెడ్డిని వీడే పరిస్థితి వచ్చింది.' - మంత్రి అనగాని