Metpally Govt Junior College Midday Meals Scheme : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కళాశాలలో సుమారు 3వేల6 మంది విద్యార్థులు చదువుతున్నారు. సర్కారు కళాశాలను నమ్ముకుని వచ్చిన పేద విద్యార్థులకు నమ్మకాన్ని పెంచేలా కళాశాల అధ్యాపకులు సమష్ఠి కృషితో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటర్మీడియట్ పరీక్షలు సమయం దగ్గర పడడంతో ఉత్తమ విద్యను అందిస్తూనే... విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అధ్యాపకులు అందరూ వారివారి సొంత డబ్బులతో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల మధ్యాహ్నం భోజన కష్టాలను చూసిన అధ్యాపకులు... సమష్టిగా ముందుకు వచ్చి కళాశాలలోనే మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో విద్యార్థులు సమయం వృథా చేయకుండా చదువుపై దృష్టి సారించేలా చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తీసుకున్న ఈ నిర్ణయానికి అధ్యాపక బృందం సహకరిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.
చదువుతోపాటు క్రీడలూ అవసరమే: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
"కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. కళాశాలలోనే మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఏర్పాటు చేయడం ద్వారా సమయం ఆదా అయ్యింది. భోజనం తర్వాత మిగితా సమయంలో చదువుకుంటూ, ఉపాధ్యాయుల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకుంటున్నాం. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇక్కడే ఉండి చదువుకుంటున్నాం." -విద్యార్థులు
కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించండంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని ఆధ్యాపకులు చెబుతున్నారు. అర్థం కాని పాఠ్యాంశాలపై సంబంధిత అధ్యాపకులతో అవగాహన పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయంలో మధ్యాహ్న భోజనానికి పిల్లలు ఇంటికి వెళ్తే సమయం వృథా అవుతుందన్న ఉద్దేశ్యంతోనే కళాశాలలో భోజనాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యాపకులు తెలిపారు.
Mid Day Meals Bills Delay Telangana : గాడితప్పిన మధ్యాహ్న భోజన పథకం.. కొత్త మెనూ అమలుపై కార్మికుల ఆందోళన
ఆ స్కూల్లో మధ్యాహ్న భోజనం సూపర్.. నెలలో 15సార్లు స్వీట్లు
వివిధ గ్రామాల నుంచి ఉదయం వచ్చే విద్యార్థులకు భోజన సమస్య తీరిందని అధ్యాపకులు అన్నారు. కళాశాలలో చదువుతో పాటు భోజనం ఏర్పాటు చేయడంతో సమయం ఆదా అవుతోందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాల నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి అధ్యాపకులు.
"విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి రావడంతో మధ్యాహ్న భోజనం ఇక్కడే ఏర్పాటు చేశాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కోసం సంసిద్ధం చేయడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. విద్యార్థుల ఉత్తీర్ణత పెంచడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. తద్వారా ప్రభుత్వ కళాశాల పట్ల తల్లిదండ్రులకు నమ్మకం కలుగుతుంది. కళాశాల అధ్యాపకులతో కలిసి సమస్టిగా ఈ నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని ఆశిస్తున్నా." - వెంకటేశ్వరరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్