Medigadda Barrage News Latest : మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, అధ్యయనం చేయడంతో పాటు పగుళ్లకు కారణాలు విశ్లేషించి, తగిన సిఫార్సులు చేసేందుకు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్డీఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది.
కమిటిలో మరో ఐదుగురిని సభ్యులుగా నియమించారు. సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్, కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ ఉన్నారు. ఎన్డీఎస్ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మూడు ఆనకట్టలకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై సమగ్ర అధ్యయనం, తనిఖీల కోసం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్ఏ కమిటీని ఏర్పాటు చేసింది.
Medigadda Barrage Issue : మేడిగడ్డ, అన్నారం(Annaram Barrage), సుందిళ్ల ఆనకట్టలను సందర్శించి స్టేక్ హోల్డర్స్‌తో చర్చించి నిర్మాణం ప్రాంత అంశాలు, హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియో టెక్నికల్ అంశాలను పరిశీలించాలని కమిటీకి ఎన్డీఎస్ఏ సూచించింది. ప్రాజెక్టు డేటా, డ్రాయింగ్స్, డిజైన్ మెమోరండా, సైట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, బ్యారేజ్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్, మెటీరియల్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్ తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని తెలిపింది. ఇన్వెస్టిగేషన్స్, డిజైన్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, నిర్వహణలో భాగస్వాములైన ప్రభుత్వ, సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు, స్టేక్ హోల్డర్స్‌తో చర్చించాలని కమిటీకి సూచించింది.
డ్రాయింగ్‌లో ఒకలా, కట్టింది మరోలా - 'మేడిగడ్డ' అంతా లోపాలమయం
నాలుగు నెలల్లోపు నివేదిక : మూడు ఆనకట్టల డిజైన్లకు సంబంధించిన ఫిజికల్, మేథమెటికల్ మోడల్ స్టడీస్(Mathematical Model Study)ను పరిశీలించాలని పేర్కొంది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుతో ఇతర అంశాలకు కారణాలను కమిటీ పరిశీలించాలని ఎన్డీఎస్ఏ తెలిపింది. ఎగువన ఉన్న రెండు ఆనకట్టల్లో గమనించిన లోపాలకు గల కారణాలను కూడా పరిశీలించాలి. మూడు ఆనకట్టల విషయంలో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సూచించాల్సి ఉంటుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ నాలుగు నెలల లోపు నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్ఏ గడువు నిర్దేశించింది.
మేడిగడ్డపై మరింత లోతుగా విజిలెన్స్ విచారణ - మెజర్మెంట్ బుక్ నిర్వాకంపై ప్రత్యేక దృష్టి
సర్వే చేయకుండా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం అతిపెద్ద తప్పు : కేంద్ర జల్ శక్తి మంత్రి సలహాదారు