ETV Bharat / state

ఆర్టీసీకి లాభాల పంట పండించిన రాఖీ - చ‌రిత్రలో ఆల్‌టైం రికార్డు ఆదాయం ఎంతంటే? - TGSRTC MD Sajjanar On RTC Income - TGSRTC MD SAJJANAR ON RTC INCOME

TGSRTC All Time Record Collection On Rakhi Festival : దేశ ప్రజా ర‌వాణా వ్యవ‌స్థలో టీజీఎస్ ఆర్టీసీ రాఖీ పండుగ రికార్డులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయ‌ని ఎండీ వీసీ స‌జ్జనార్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల‌కు గాను 92 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియోను (ఓఆర్‌)న‌మోదు చేశాయన్నారు. రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల వ‌ర‌కు రాబ‌డి వ‌చ్చిందన్నారు. అందులో మ‌హాల‌క్ష్మి ప‌థకం ద్వారా రూ.17 కోట్లు, న‌గ‌దు చెల్లింపు టికెట్ల ద్వారా రూ. 15 కోట్ల వ‌ర‌కు వ‌చ్చిందన్నారు. ఆర్టీసీ చ‌రిత్రలో ఇది ఆల్‌టైం రికార్డు అని సంస్థ ఎండీ స‌జ్జనార్ అన్నారు.

TGSRTC Earned Record Revenue on Raksha Bandhan
TGSRTC All Time Record Collection On Rakhi Festival (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 4:19 PM IST

TGSRTC Earned Record Revenue on Raksha Bandhan : ర‌క్షాబంధ‌న్ ప‌ర్వదినం సందర్బంగా రికార్డు స్థాయిలో 63 ల‌క్షల మంది వ‌ర‌కు ప్రయాణికుల‌ను క్షేమంగా గ‌మ్యస్థానాల‌కు చేర్చిన సంస్థ సిబ్బంది, అధికారుల‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ వీసీ స‌జ్జనార్ అభినందించారు. సోద‌ర‌భావానికి ప్రతీకైన రాఖీ పండుగ‌ను త్యాగం చేసి భారీ వ‌ర్షాల్లోనూ నిబ‌ద్దత, అంకిత‌భావం, క్రమ‌శిక్షణ‌తో ప‌నిచేశార‌ని వారి సేవ‌ల‌ను ఆయ‌న కొనియాడారు.

అత్యంత ర‌ద్దీలోనూ మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ సౌక‌ర్య ప‌థ‌కాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేశార‌ని, ఒక్కరోజే 41.74 ల‌క్షల మంది మ‌హిళామ‌ణుల‌ను సుర‌క్షితంగా గ‌మ్యస్థానాల‌కు చేర‌వేశార‌ని ఎండీ స‌జ్జనార్ పేర్కొన్నారు. ర‌క్షాబంధ‌న్ ప‌ర్వదినం రోజున టీజీఎస్ఆర్టీసీ బ‌స్సులు రికార్డు స్థాయిలో 38 ల‌క్షల కిలోమీట‌ర్లు తిరిగాయన్నారు. స‌గ‌టున 33 ల‌క్షల కిలోమీట‌ర్లు తిరుగుతుండ‌గా, 19వ తేదీన 5 ల‌క్షల కిలోమీట‌ర్లు అద‌నంగా తిరిగాయన్నారు.

రికార్డు స్థాయిలో ప్రయాణికులు - అధిక మొత్తంలో ఆర్టీసీ ఆదాయం : ఒక్కరోజులో మొత్తంగా 63 ల‌క్షల మంది వ‌ర‌కు ప్రయాణించారన్నారు. అందులో అత్యధికంగా హైద‌రాబాద్ రీజియన్​లో 12.91 ల‌క్షలు, సికింద్రాబాద్ పరిధిలో 11.68 ల‌క్షలు, క‌రీంన‌గ‌ర్ రీజియన్​లో 6.37 ల‌క్షలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్రాంతంలో 5.84 ల‌క్షలు, వ‌రంగ‌ల్ రీజియన్​లో 5.82 ల‌క్షల మందిని బస్సులు గ‌మ్యస్థానాల‌కు చేర‌వేశాయని ఎండీ సజ్జనార్ తెలిపారు. 97 డిపోల‌కు గాను 92 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియోను (ఓఆర్‌)న‌మోదు చేశాయన్నారు.

TGSRTC MD Sajjanar On RTC Income : రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల వ‌ర‌కు రాబ‌డి వ‌చ్చిందన్నారు. అందులో మ‌హాల‌క్ష్మి ప‌థకం ద్వారా రూ.17 కోట్లు, న‌గ‌దు చెల్లింపు టికెట్ల ద్వారా రూ. 15 కోట్ల వ‌ర‌కు వ‌చ్చిందన్నారు. ఆర్టీసీ చ‌రిత్రలో ఇది ఆల్‌టైం రికార్డు అని సంస్థ ఎండీ స‌జ్జనార్ అన్నారు. ప్రజార‌వాణా వ్యవ‌స్థపై ప్రజ‌ల ఆద‌రాభిమానాలు ఎంత‌లా ఉన్నాయో చెప్పడానికి రాఖీ పండుగ రికార్డులే నిద‌ర్శన‌మ‌న్నారు. దేశ ప్రజా ర‌వాణా వ్యవ‌స్థలో టీజీఎస్ ఆర్టీసీ రాఖీ పండుగ రికార్డులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయ‌ని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

గ‌త రెండు వారాల్లో మూడు సార్లు క్షేత్ర స్థాయి సిబ్బందితో వ‌ర్చువ‌ల్‌గా యాజ‌మాన్యం స‌మావేశం నిర్వహించింద‌ని తెలిపారు. మూడు రోజుల్లో 2,587 ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డిపిన‌ట్లు వివ‌రించారు. ప్రయాణికులకు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా మెరుగైన, నాణ్యమైన సేవ‌ల‌ను అందించాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వివ‌రించారు. ఈ ఆదేశాల ప్రకారం డిపో మేనేజ‌ర్లు గేట్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి సిబ్బందిని మోటివేట్ చేశార‌ని చెప్పారు.

ఇంటి వద్దకే టీజీఎస్​ఆర్టీసీ కార్గో సేవలు - ఎప్పటినుంచి ప్రారంభం తెలుసా? - TGSRTC Cargo Door Delivery

త్వరలో సెమీ డీలక్స్ బస్సులు రయ్ రయ్ - మహిళలు కూడా టికెట్ కొనాల్సిందే - NO FREE TICKET IN SEMI DELUXE BUS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.