ETV Bharat / state

ఉద్యోగుల ఆలస్యంపై మేయర్ సీరియస్ - లేట్​గా వచ్చిన వారికి మెమోలు జారీ - GHMC Mayor Vijayalakshmi Inspection

Mayor Gadwal Vijayalakshmi Inspected GHMC Main Office : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగుల పనితీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో సమయపాలన పాటించడం లేదంటూ మండిపడ్డారు. విధులకు ఆలస్యంగా హాజరవుతున్న ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

GHMC Mayor Fire On Employees Attendance
Mayor Gadwal Vijayalakshmi Inspected GHMC Main Office (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 5:26 PM IST

GHMC Mayor Vijayalakshmi Fire On Employees Attendance : బల్దియా ఉద్యోగుల తీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శివాలెత్తారు. ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఆయా విభాగాల ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని, పనులు చేయకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. కొందరు డిపార్ట్​మెంట్ల ఉద్యోగులపై పదే పదే ఆరోపణలు రావడంతో ఇవాళ ఉదయం 11 గంటలకు మేయర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

పరిపాలన విభాగం అధికారిణి నళిని పద్మావతితో కలిసి ఏడు అంతస్తుల్లోని ప్రతి డిపార్ట్​మెంట్​ను తనిఖీ చేశారు. సుమారు గంటన్నరపాటు అన్ని విభాగాలను పరిశీలించి ఉద్యోగుల పనితీరును ఎండగట్టారు. ఏ సమయానికి విధులకు హాజరవుతున్నారు, ఆఫీసు సమయంలో వ్యక్తిగత పనులెందుకు అంటూ ఉద్యోగులను ప్రశ్నించారు. మరికొంత మందిని అబద్దాలు చెప్పొద్దు. ఎన్ని గంటలకు వచ్చారో చెప్పాలని నిలదీశారు.

ఇష్టముంటే పనిచేయండి లేకుంటే వెళ్లిపోవాలని వార్నింగ్ : పనిచేయడం ఇష్టలేకపోతే ఉద్యోగాల్లో నుంచి వెళ్లిపోవాలని సూచించిన మేయర్, రేపటి నుంచి జీహెచ్ఎంసీలో కొత్త నిబంధనలు అమలు చేస్తామని హెచ్చరించారు. ప్రతి డిపార్ట్​మెంట్​కు సంబంధించి ఉద్యోగుల హాజరు రిజిస్ట్రర్​ను ఇకపై తానే స్వయంగా పరిశీలిస్తానని, ఆలస్యంగా వచ్చే వారిని గుర్తించి గైర్హాజరు కింద నమోదు చేయాలని పరిపాలన విభాగం అధికారులను మేయర్ ఆదేశించారు.

జీహెచ్ఎంసీ పనితీరుకు చెడ్డపేరు రాకూడదనే ఇన్నాళ్లు కార్యాలయాల్లో తనిఖీలు చేయలేదన్న విజయలక్ష్మి, ఆ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ జీహెచ్ఎంసీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఇక నుంచి ఆలస్యమైందనే మాట వినిపించకూడదని, ఎలాంటి వివరణలు ఇవ్వకూడదని మేయర్ ఉద్యోగులను హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటలవుతున్నా క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఎస్​ఎస్ నిత్యానందం విధులకు హాజరుకాకపోవడంపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mayor Vijayalakshmi Warn to GHMC Officers : జీహెచ్ఎంసీ ఉద్యోగుల హాజరుకు సంబంధించి ఇకపై రిజిస్టర్​లో సంతకాలు చేయడం ఉండదని, బయోమెట్రిక్ విధానంతో పాటు ఫేస్​ రికగ్నైజ్​లను తప్పనిసరి చేస్తామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. రేపటి నుంచి సర్క్యులర్ జారీ చేస్తామని, ప్రతి ఉద్యోగి ఉదయం 10.30 గంటల కల్లా విధులకు హాజరుకావాలని మేయర్ ఆదేశించారు.

ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతేనే ప్రజలకు సంబంధించిన పనులు సకాలంలో జరుగుతాయని, అందుకు సంబంధించిన ఫైల్స్ పనితీరును కూడా త్వరలోనే పరిశీలించనున్నట్లు మేయర్ విజయలక్ష్మి వివరించారు. మరోవైపు బల్దియాలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారుల బదిలీలు కూడా ఉంటాయని, వారం రోజుల్లో అంతర్గత బదిలీలు చేయనున్నట్లు మేయర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.

మహానగరంలో మూత్రశాలలు కరవు - మరుగుదొడ్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ - Lack of Public Toilets in GHMC

అక్రమాలకు అడ్డాగా జీహెచ్ఎంసీ - కాగ్ నివేదికలో సంచలన విషయాలు - CAG report on GHMC corruption

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.