Fire Accident At Mallapur Industrial Estate : తెలంగాణలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాంసన్ పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. రాంసన్ గోదాం పక్కకు ఆనుకొని ఉన్న తిరుమల వుడ్ కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో ఏదో చోట అగ్నిప్రమాదాలు జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
'పెయింట్లకు సంబంధించిన గోదాంలో అగ్నిప్రమాదం జరిగిందని మాకు సమాచారమందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాము. అగ్నిప్రమాదం ఏవిధంగా జరిగిందనేది దర్యాప్తులో ఇంకా తేలాల్సి ఉంది. స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు"-చక్రపాణి, ఏసీపీ
'ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో వర్కర్లు ఎవరూ లేరు. గోదాం బయట సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఇద్దరు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాము. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాము' అని రమేశ్ అనే స్థానికుడు తెలిపారు.
ఊరు విడిచి వెళ్లిన మహిళ- ఇంతలోనే ఇల్లు దగ్దం! - Fire Accident In Nellore District
అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్ - 17 మంది మృతి - Reactor Blast in Pharma Company