Married Woman Attempts Suicide With His 11 Month Son : 'బావా నన్ను క్షమించు. నాకు చావు తప్పదని తెలుసు. డాక్టర్ నీతో చెబుతుంటే విన్నాను. చావు కోసం ఎదురు చూడకుండా నేనే దాన్ని వెతుక్కుంటూ పోతున్నాను. గతంలో కూడా నేను చావడానికి వెళ్లాను. కానీ నీకు దొరికాను. ఈ సారి మాత్రం చావడానికే వెళుతున్నాను. సారీ బావా' అంటూ లేఖ రాసి 11 నెలల కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో కుమారుడు చనిపోయాడు. తల్లిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లక్కవరం గ్రామంలో చోటు చేసుకుంది.
మానసికంగా ఇబ్బంది : భర్త రణపంగు నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన మమతకు, హుజూర్‌నగర్ మండలం లక్కవరం గ్రామానికి చెందిన రణపంగు నవీన్‌కు 2018లో పెళ్లి అయింది. వీరికి సాన్వి (6) పాప, అయాన్ (11 నెలలు) బాబు ఉన్నారు. మమతకు 4 నెలల క్రితం వైరల్ ఫీవర్ తీవ్రంగా రావడంతో హైదరాబాద్ నగరంలో చికిత్స చేయించారు. తర్వాత బాగానే ఉన్న నెల రోజుల క్రితం మమత ఇంటి నుంచి వెళ్లిపోయింది. అనంతరం భర్త భర్త నవీన్‌కు కాల్ చేసి తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని, వెతకొద్దని చెప్పింది. ఆ సమయంలో ఆమె భర్త ఆమె పుట్టింటి వారితో కలిసి ఆచూకీ తెలుసుకొని ఇంటికి తీసుకువచ్చాడు. చికిత్స అనంతరం నుంచి మమత మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు.
సూసైడ్ నోట్ : బుధవారం రాత్రి ఇంటికి వెళ్లే ముందు కాల్ చేసి వర్షం పడుతుండటంతో ఆలస్యంగా వస్తానని చెప్పినట్లు నవీన్ తెలిపారు. వాన తగ్గాక ఇంటికి వెళ్లే సరికి ఇంట్లో భార్య లేదని, పాప నిద్రపోతున్నట్లు గమనించారు. అనంతరన పరిసరాలలో వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో ఆమెకు కాల్ చేయగా మొబైల్ ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. టీవీ వద్ద సూసైడ్ నోట్ (Suicide Note) ఉండటాన్ని గమనించారు. చుట్టుపక్కల వారితో కలిసి ఆమెను వెతకడం మొదలుపెట్టారు.
ఇంటి దగ్గరలోని వ్యవసాయ బావుల్లో చూసేందుకు వెళ్లారు. అక్కడ ఓ బావిలో పెద్ద శబ్దం కాగా నవీన్, అతడితో ఉన్నవారు అప్రమత్తమై ఆమెను రక్షించారు. కుమారుడు అయాన్ గురించి ప్రశ్నించగా పలు రకాలుగా జవాబులు చెబుతుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆమెను అడగ్గా బావిలోనే పడేసినట్లు తెలిపారు. ఆ బావిలో ఎంత వెతికినా దొరక్కపోవడంతో తిరిగి గురువారం గాలింపు చర్యలు చేపట్టి అయాన్ మృతదేహాన్ని బయటకు తీశారు. నవీన్ ఫిర్యాదు మేరకు సీఐ చరమంద రాజు, ఎస్సై ముత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమ్ముడి మోసాన్ని తట్టుకోలేక పోయిన అన్నయ్య - ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణం