Maridi killed in vadina At Padamata: వదిన అంటే తల్లితో సమానం అంటారు. అలాంటి వదిననే అతి కిరాతకంగా గొంతు కోసి తన మరిదే హతమార్చాడు. ఈ ఘటన విజయవాడలో అనూహ్యంగా చోటుచేసుకుంది. వదినను గొంతు కోసి చంపేసి అనంతరం మరిది గొంతు కోసుకుని చావు బతుకుల మధ్య ఉన్న ఘటన విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్మజా నగర్‌కు చెందిన బంగారు దుర్గ అనే మహిళ ఆరు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటోంది. దుర్గకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె సంతోషినికి వివాహం అయ్యింది. కుమారుడు బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. చిన్న కుమార్తె నాగలక్ష్మి గన్నవరంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. దుర్గ రైతు బజారు సమీపంలోని ఇండోర్ స్టేడియంలో స్వీపర్‌గా పని చేస్తోంది. దుర్గ తన చెల్లి భర్త హరికృష్ణతో సన్నిహితంగా ఉండేది.
రూ.500 కోసం గొడవ- ఫ్రెండ్ కన్ను పీకేసి గొంతు కోసి హత్య
Murder in Vijayawada: ఎన్ఎసీ కల్యాణ మండపం సమీపంలో ఉంటున్న హరికృష్ణ కూడా గత నాలుగు సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. హరికృష్ణకు ఇద్దరు సంతానం. కుమారుడిని హాస్టల్లో, కుమార్తెను తన దగ్గరే ఉంచుకొని చదివిస్తున్నాడు. హరికృష్ణ స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరికృష్ణతో దుర్గ సన్నిహితంగా మెలుగుతుందని ఆమె కుమారుడు అతడిపై దాడి చేశాడు. దుర్గ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై తరుచూ గొడవపడటంతో కొంతకాలం నుంచి ఆమె హరికృష్ణను దూరం పెట్టింది. దీంతో అతను దుర్గపై ద్వేషం పెంచుకున్నాడు.
ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య - ఆపై కిడ్నాప్ డ్రామా
ఈ క్రమంలో హరికృష్ణ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పద్మజా నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లాడు. కొంత సేపటికి అతను గొంతు కోసుకొని తీవ్ర రక్తస్రావంతో ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద పడిపోయాడు. గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే దుర్గ గొంతు కూడా కోసేయగా రక్తం మడుగులో ఆమె కింద పడి ఉంది. వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. తీవ్రంగా గాయపడిన హరికృష్ణకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణామా లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట సీఐ మోహన్ రెడ్డి తెలిపారు