ETV Bharat / state

పార్వతీపురం జిల్లా ఆస్పత్రి పనులు నత్తనడక - రోగులకు తిప్పలు

Manyam District Hospital Problems to Patients : మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతానికి ఏకైక ఆధారమైన పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిగా ప్రకటించింది. ఈ మేరకు సకల సదుపాయాలతో మరో 50 పడకల భవన నిర్మాణానికి 21 కోట్ల రూపాయల అంచనాతో రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేసింది. అయితే అదనపు పడకల భవనం పనులు ఏడాదిగా సాగుతున్నాయి. వీటితోపాటు ఆసుపత్రి పాత భవనం ఆధునీకరణ పనులూ నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులు పూర్తికాకపోవడంతో రోగులకు తిప్పలు తప్పటం లేదు.

manyam_district_hospital_problems_to_patients

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 3:00 PM IST

Manyam District Hospital Problems to Patients : పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రిలో రోగుల తాకిడి అధికం ఉంటుంది. ఇక్కడ వంద పడకలు ఉన్నా, 250మంది వరకు వివిధ వైద్య విభాగాల్లో చేరుతుంటారు. సాధారణ రోజుల్లో 130నుంచి 150 వరకు కేసులు ఉంటాయి. OP సంఖ్య 500 నుంచి 600 వరకు నమోదవుతూ ఉంటుంది. ప్రతి నెల 300 నుంచి 350 ప్రసవాలు జరుగుతుంటాయి. వీటితోపాటు 100 వరకు శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు ఇక్కడి వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైద్యశాలను 150 పడకల ఆసుపత్రిగా మార్చింది. ఇందులో భాగంగా 21కోట్ల రూపాయలతో 100 పడకలున్న పాత భవనాల ఆధునీకరణతోపాటు, 50 పడకల అదనపు భవన నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ మేరకు నూతన భవన నిర్మాణానికి 2022లో శంకుస్థాపన జరిగింది. అయితే 50 పడకల భవన నిర్మాణం ఏడాదిగా సాగుతుండగా పాతభవనం ఆధునీకరణ పనులూ నత్తనడకన కొనసాగుతున్నాయి.

డాక్టర్ గోఖలే బృందానికి సహకరించని జీజీహెచ్.. శస్త్ర చికిత్సలు చేయలేమని..

'పార్వతీపురం జిల్లా ఆసుపత్రి (Hospital) ప్రస్తుతం వంద పడకల వైద్యశాలగా కొనసాగుతోంది. ఎండోస్కోపీ, ఐసీయూ, నవజాత శిశు కేంద్రం, పౌష్టికాహార కేంద్రం, రక్తనిల్వ కేంద్రం, సిటీ స్కాన్ వంటి ఆధునిక సేవలు వైద్యశాలలో అందుబాటులోకి వచ్చాయి. కానీ అవసరానికి తగ్గ పడకలు లేవు. అందుబాటులో ఉన్న 100 పడకల భవనం అసౌకర్యంగా ఉంది. మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. రోగులకు చెందిన పలు వార్డులు సైతం పైకప్పు చెమ్మపట్టాయి. వైద్య నిపుణుల కొరత సమస్యగా మారింది. దీంతో సాధారణ రోగాలతో పాటు కాన్పులు, సాధారణ శస్త్రచికిత్సలు మాత్రమే చేస్తున్నారు. రోగుల (patients) సహాయకులకు సదుపాయాలు లేక ఆరుబయట ఉంటున్నారు.' -రంజిత్ కుమార్, గిరిజన సంఘం నేత, శ్రీదేవి, లక్ష్మి, పార్వతీపురం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగుల అగచాట్లు.. గంటల తరబడి క్యూలైన్లలో

'అదనపు పడకల భవనం పూర్తి కాకపోవడం పాత ఆసుపత్రి భవనాల ఆధునీకరణ పనుల్లో జాప్యం చోటు చేసుకోవటం వాస్తవం. రూ. 3కోట్లతో ఏపీఎంఐడీసీ (APMIDC) చేపట్టిన ఆధునీకరణ పనుల ఆలస్యం కారణంగా రోగులతో పాటు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోయి పనుల వేగవంతం కోసం చర్యలు తీసుకున్నాము.' -వాగ్దేవి, ఆస్పత్రి పర్యవేక్షకురాలు

పడకేసిన ప్రభుత్వాసుపత్రి.. సౌకర్యాల కొరతతో పేషెంట్ల అవస్థలు..

ఇదిలా ఉండగా పార్వతీపురంలో రూ. 49.26 కోట్లతో స్థానిక పశు ఆసుపత్రి ఆవరణలో వైద్యశాఖ నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి (Multi specialty hospital) నిర్మాణ పనులు ఏడాదిగా పిల్లర్లకే పరిమితమయ్యాయి. జిల్లా ఆసుపత్రిలో బిల్డింగ్​ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.