ETV Bharat / state

మా ఇంటి గొడవను పెద్దదిగా చేసి చూపించొద్దు - సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా : విష్ణు - MANCHU FAMILY FIGHT

ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయన్న మంచు విష్ణు - సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నానని వెల్లడి

Manchu Vishnu on Manchu Family Dispute
Manchu Vishnu on Manchu Family Dispute (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 3:54 PM IST

Manchu Vishnu on Manchu Family Dispute : తమ నివాసంలో జరిగిన ఘర్షణలో రిపోర్టర్‌పై దాడి జరగడం దురదృష్టకరమని మంచు విష్ణు అన్నారు. గత రెండు రోజులుగా తమ కుటుంబంలో జరుగుతున్న వివాదంపై మంచు విష్ణు స్పందించారు. ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని, తమ ఇంట్లో గొడవ (Manchu Family Fight)ను పెద్దదిగా చేసి చూపించవద్దని మంచు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఎవరైనా ప్రేమతో గెలవాలని, రచ్చతో కాదని తెలిపారు. ఈ వివాదం తమ మనసులను ఎంతో బాధపెడుతోందని పేర్కొన్నారు. తమను విపరీతంగా ప్రేమించడమే తన నాన్న చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు.

అలా జరిగి ఉండకూడదు : ఘర్షణలో మీడియా ప్రతినిధికి గాయాలు కావడం దురదృష్టకరమని మంచు విష్ణు అన్నారు. మంగళవారం జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని, మోహన్‌బాబు నమస్కరిస్తూనే మీడియా ముందుకు వచ్చారని, మొహం మీద మైకు పెట్టడంతో క్షణికావేశంలో కొట్టారని, అలా జరిగి ఉండకూడదని పేర్కొన్నారు. ఆ ఘర్షణలో మోహన్ బాబుకు కూడా కొన్ని గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన జర్నలిస్టు కుటుంబ సభ్యులతో మాట్లాడానని, తాను లేని నాలుగైదు రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయని చెప్పారు.

సీపీని కలవాల్సిన అవసరం లేదు : కన్నప్ప సినిమా పోస్టు ప్రొడక్షన్‌ పని మీద లాస్‌ఏంజెల్స్‌లో ఉండగా ఫోన్ వచ్చిందని, దీంతో వెంటనే అమెరికా నుంచి వచ్చేశానని విష్ణు తెలిపారు. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. పోలీసుల నోటీసులు తమకు రాకముందే మీడియాకు లీక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గన్‌ సరెండర్‌ చేయాలని మంగళవారమే ఆదేశించినట్లు మీడియాలో వచ్చిందని అన్నారు. గన్‌ సరెండర్‌పై ఇవాళ ఉదయం 10.30 గంటలకు తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.

"నేను ఇంటికి వెళ్లడానికి అదొక్కటే కారణం - నా భార్య తల్లిదండ్రులు ఉండుంటే ఊరుకునేవారా?"

ఉదయం 9.30 గంటలకు నోటీసు ఇచ్చి, 10.30కు విచారణకు రమ్మంటే ఎలా? అని ప్రశ్నించారు. కమిషనర్‌పై ఉన్న గౌరవంతో విచారణకు వెళ్తానని తెలిపారు. ఏ ప్రాతిపదికన తనకు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఘటన జరిగినప్పుడు తాను దేశంలోనే లేనని, మరి నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీపీని కలవాల్సిన అవసరం తనకు లేదని అయినా కలుస్తానని చెప్పారు. కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని, కుటుంబ వివాదం గురించి ఏమీ మాట్లాడనని చెప్పారు. చిన్నవాడు అవగాహన లేకుండా మాట్లాడి ఉండొచ్చునని పేర్కొన్నారు. తాను మాత్రం అలా మాట్లాడలేనని స్పష్టం చేశారు.

"ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి. సమస్య పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంట్లో గొడవను పెద్దదిగా చేసి చూపించవద్దని నా విజ్ఞప్తి. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నా. ఎవరైనా ప్రేమతో గెలవాలి.. రచ్చతో కాదు."- మంచు విష్ణు

మీడియా ప్రతినిధులపై దాడి - మోహన్‌బాబుపై కేసు నమోదు

'నా పరువు, ప్రఖ్యాతలు మంటగలిపావు మనోజ్​' - మోహన్​బాబు ఆడియో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.