ETV Bharat / state

నాడు ఆవేశంతో భార్యను హతమార్చి- నేడు పశ్చాత్తాపంతో ఆమె సమాధి వద్దే భర్త ఆత్మహత్య - MAN SUICIDE AT WIFE TOMB

భార్యను హత్య చేశానని పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్న భర్త

MAN SUICIDE IN CHITTOOR
MAN SUICIDE AT TOMB (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2024, 2:31 PM IST

Man Suicide after Released from Jail in wife murder case : మనస్పర్థల వల్ల భార్యను హత్య చేశానని పశ్చాత్తాపం, గ్రామంలో తలెత్తుకు తిరగలేని పరిస్థితి.. ఈ నేపథ్యంలో ఓ భర్త అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లో చిత్తురు జిల్లా రామకుప్పం మండల పరిధిలో ఆదివారం జరిగింది. రామకుప్పం ఎస్సై వెంకట మోహన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం పదేళ్ల క్రితం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత దంపతులకు వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లిన ఆ దంపతులు అక్కడే కూరగాయల వ్యాపారం పెట్టి జీవనం సాగించేవారు.

ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం దంపతుల మధ్య మనస్పర్థల ఏర్పడి గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన గంగిరెడ్డి తన భార్య సుజాతపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె మృతి చెందింది. బెంగళూరులోనే గంగిరెడ్డి పోలీసులకు లొంగిపోగా ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి స్వగ్రామం వచ్చిన గంగిరెడ్డి, పిల్లలతో కలిసి భోజనం చేశాడు. అదివారం ఉదయం లేచిచూసే సరికి తండ్రి కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. చివరకు భార్య సుజాత సమాధి వద్ద చెట్టుకు గంగిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.

మ్యాథ్స్ రావడం లేదని విద్యార్థికి గోడ కుర్చీ వేయించిన టీచర్​ - తరువాత ఏమైందంటే!

'నాకు చావు తప్పదని తెలుసు - డాక్టర్‌ నీతో చెబుతుంటే విన్నాను - సారీ బావా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.