ETV Bharat / state

దుర్వాసన వస్తోందని స్థానికుల ఫిర్యాదు- ఇంట్లో చూస్తే షాక్​! - DEAD BODY WAS IN HOUSE FIVE DAYS

అందరు ఉన్నా అనాథగానే జీవనం- అయిదు రోజులు ఇంట్లోనే మృతదేహం

man_died_in_his_house
man_died_in_his_house (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 12:46 PM IST

Man Died in His House Dead Body Was in The House for Five Days in Prakasam District : అతడికి ఓ కుటుంబం ఉంది. ఆస్తి, ఆదరణ అన్నీ ఉన్నాయి. అతను ఒకప్పుడు బాగా బతికారు. కానీ అదంతా గతం విధి వక్రీకరించి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత అయినవారికి తానే దూరంగా ఉంటున్నారు. ఒంటరిగా బతుకీడుస్తున్నారు. అందరూ ఉన్నా ఒకప్పుటి జీవితాన్ని కోల్పోయానన్న మనోవేదన అతడ్ని మానసికంగా కుంగదీసింది.

కుటుంబంతో, సంఘంలో ఉండలేక వేరే చోట ఉన్న సొంత ఇంట్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఎవరికీ తెలియలేదు.ఎందుకంటే అతడెప్పుడోగానీ బయటకొచ్చింది లేదు. ఇప్పుడది ఎవరికీ అనుమానాస్పదముగానో కొత్తగానో తోచలేదు. దీంతో అయిదు రోజులపాటు అతని మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం వెలుగు చూసింది.

గ్రామీణ ఎస్సై అంకమ్మరావుతో పాటు గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన గుంటక సత్యనారాయణ(75)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సత్యనారాయణకు అటు గ్రామంలో, ఇటు పట్టణంలో ఆస్తిపాస్తులు ఉన్నాయి. రాయవరంలో బియ్యం మిల్లు కూడా నిర్వహించారు. అనంతర కాలంలో ఇతరులకు విక్రయించారు. అప్పటి నుంచి ఆయన గ్రామస్థులకు, భార్యా బిడ్డలకు దూరంగా మసలసాగారు.హోటళ్ల నుంచి భోజనం తెచ్చుకుని తింటూ గ్రామంలోని సొంత ఇంట్లో ఒంటరిగా జీవనం గడుపుతున్నారు.

గుండెల్ని పిండేసే సంఘటన- బిడ్డ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకొని విలపించిన తల్లిదండ్రులు - family with son dead body

కొంతకాలంగా మధుమేహంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మరుగుదొడ్డిలో కాలు జారిపడ్డారు. తలకు బలమైన గాయం కావడంలో తీవ్ర రక్తస్రావమై మృతి చెందారు. అయిదు రోజుల పాటు ఈ విషయం ఎవరికీ తెలియలేదు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఎస్సైతో పాటు సిబ్బంది వచ్చి పరిశీలించగా సత్యనారాయణ అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించారు. మృత దేహాన్ని పరిశీలించిన అనంతరం శవ పరీక్ష నిమిత్తం మార్కాపురం సర్వజన వైద్యశాలకు తరలించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పాపం చిన్నారి ! - రెండు రోజులు తల్లి మృతదేహంపైనే - Child Hanging on Mother Dead Body

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.