Malakpet Jewellery Robbery Case Update : మలక్‌పేట అక్బర్‌బాగ్‌లోని కిస్వా బంగారం దుకాణంలో ఈ నెల 14న జరిగిన దొంగతనం కేసులో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. యజమాని కుమారుడు రెహమాన్ దుకాణంలో ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు నిందితులు లోనికి ప్రవేశించి అతనిపై కత్తితో దాడి చేసి దుకాణంలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దోచుకుపోయారు. అనంతరం ప్రధాన నిందితుడు నజిమ్ అజీజ్ కొటాడియా తన ద్విచక్ర వాహనాన్ని డీమార్ట్(D-Mart) సమీపంలో ఉంచి, అక్కడి నుంచి ఆటోలో అబిడ్స్ వెళ్లాడు. మరో ఇద్దరు నిందితులు ద్విచక్రవాహనం ద్వారా సికింద్రాబాద్ చేరుకున్నారు.
ముగ్గురు నిందితులు కలిసి కొంపల్లిలోని ప్రధాన నిందితుడి నివాసానికి చేరుకున్నారు. చోరీ చేసిన ఆభరణాలను ఇంట్లో భద్రపరిచి ఆటో, ద్విచక్ర వాహనాల కోసం తిరిగి చోరీ చేసిన ప్రాంతానికి వచ్చినట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రధాన నిందితుడు నజిమ్ అజీజ్ కొటాడియా గతంలో విదేశాల్లో పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత సంవత్సరం హైదరాబాద్ వచ్చి విదేశాల్లో సంపాదించిన డబ్బుతో జల్సాలు చేశాడు. తిరిగి ఎలాగైనా డబ్బు సంపాందిచాలని దొంగతనాలకు ప్రణాళిక రచించాడని పోలీసులు తెలిపారు.
Police Arrest Three Accused in Malakpet Robbery Case : తన వద్ద ఉన్న డబ్బుతో ర్యాపిడో కోసం మూడు ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. దాని ద్వారా వచ్చే డబ్బు సరిపోకపోవడంతో శౌకత్ రాయ్, వారిస్‌లతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. మాస్కు ధరించి చోరీలకు పాల్పడితే ఎవరూ గుర్తించరని భావించిన నిందితులు, అదే తరహాలో దోపిడీలకు తెగబడ్డారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులను డీసీపీ అభినందించారు.
'ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఏమీ లేదు. జ్యువెలరీ షాప్‌లో ఒక్కడే ఉండడం చూసి, రెక్కీ కూడా నిర్వహించారు. ఇది 14వ తేదీన జరిగింది. 13వ తేదీన కూడా వచ్చి ట్రై చేశారు. కానీ షాప్‌లో ముగ్గురు, నలుగురు ఉండేసరికి చూసుకొని వెళ్లిపోయారు. 14న మధ్యాహ్నం వారిస్ అనే వ్యక్తి షాప్‌నకు వచ్చి మొదట మాటల్లో పెట్టగా, మిగిలిన ఇద్దరు నజిమ్, శౌకత్ వచ్చి యజమానిని కత్తితో గాయపరిచి గోల్డ్ అంతా తీసుకొని పోయారు'.- జానకి ధారావత్, ఆగ్నేయ మండలం డీసీపీ
'కనులు కనులను దోచాయంటే' సినిమాలోని ఏటీఎం చోరీ సీన్ రిపీట్ - చివరకు?
రెచ్చిపోయిన దొంగలు- కస్టమర్స్‌లా జువెల్లరీ షాప్‌లోకి చొరబడి యజమానిపై దాడి!