Mahabubnagar Software Engineer Dies By Suicide in Hyderabad : తల్లిదండ్రుల కోరిక మేరకు వివాహమాడింది. కోటీ ఆశలతో వివాహ బంధంలోకి అడుకుపెట్టింది. కట్టుకున్నవాడితో జీవితాన్ని ఊహించుకుంది. అనుకున్నట్లుగానే తన భర్త మొదట్లో బాగానే ఉన్నా తర్వాత అతని వేధింపులు మొదలయ్యాయి. ఆశలన్నీ అడియాశలై పోయాయి. భర్త పెట్టే వేధింపులు తాళలేక తనువు చాలించింది ఆ మహిళ. తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు వేధింపులు తట్టుకోలేక మనోవేధనకు గురై సాఫ్ట్‌వేర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం, నందిపేటకు చెందిన సుప్రియా రెడ్డి (26)ను అదే జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన మద్దూరు రాఘవేంద్ర రెడ్డికి ఇచ్చి మార్చి 24న పెళ్లి చేశారు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధి శంషీగూడలో నివాసం ఉంటున్నారు.
ఆస్తి తేవాలంటూ రోజూ ఒత్తిడి చేసి : వివాహమైన తర్వాత కొన్నే రోజులు రాఘవేందర్‌రెడ్డి భార్యతో మంచిగా ఉన్నాడు. అంతే తర్వాత తాను చెప్పినట్టే వినాలని, ఆమె జీతం కూడా తన బ్యాంకు ఖాతాలోనే జమచేయాలని , ఇళ్లు కట్టుకునేందుకు పుట్టింటి నుంచి 3ఎకరాలు రాయించుకుని రావాలని సుప్రియను వేధించసాగాడు. ఇదే విషయమై సుప్రియపై ఒత్తిడి చేశాడు. ఇలా వారి గొడవల్ల సాగుతున్న వారి సంసారంలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాత్రి 11.30 గంటలకు సుప్రియ ఉరేసుకున్నట్లు పక్కింటి వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో ఆమె భర్త రాఘవేందర్‌రెడ్డి ఆఫీస్‌కు వెళ్లాడు.
మాతో అప్పుడే మాట్లాడింది ఇంతలోపే ఇలా : అయితే తమ కుమార్తె రాత్రి 8గంటలకు తమతో మాట్లాడిందని చెప్పారు. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉన్నట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమించిన యువతి నో చెప్పిందని - పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
పాపం ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో - కుమారుడిని చంపి - ఆపై తానూ ఆత్మహత్య